ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur : ఇష్టంలేని పని చేయలేక..14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

ABN, Publish Date - Dec 21 , 2024 | 05:20 AM

బడికి వెళ్లాల్సిన వయసులో తమ కుమారుడిని పనిబాట పట్టించారు. ఊరికి దూరంగా, బాలుడికి ఇష్టంలేని పనిలో చేర్చారు.

  • బలవంతంగా సెంట్రింగ్‌ పనులకు పంపిన తల్లిదండ్రులు

  • వ్యవసాయ పనులు చేస్తానన్నా వినని వైనం

అనంతపురం క్రైం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బడికి వెళ్లాల్సిన వయసులో తమ కుమారుడిని పనిబాట పట్టించారు. ఊరికి దూరంగా, బాలుడికి ఇష్టంలేని పనిలో చేర్చారు. ‘ఊరికి వచ్చేస్తాను. నాన్నతో కలిసి వ్యవసాయ పనులు చేస్తాను’ అని ఆ బాలుడు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. సెంట్రింగ్‌ పనులు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నచ్చజెప్పారు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన 14 ఏళ్ల బాలుడు శివ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన కురవ అయ్యన్నకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వ్యవసాయం జీవనాధారం. అయితే పెద్ద కుమారుడు నాగేంద్ర, చిన్న కుమారుడు శివ ఆరో తరగతితోనే చదువు మానేశారు. నాగేంద్ర తమ బంధువుల పిల్లలైన సురేశ్‌, రమేశ్‌లతో కలిసి కొన్నేళ్ల క్రితం నుంచి అనంతపురం నగరంలోని హమాలీ కాలనీలో ఉంటూ, సెంట్రింగ్‌ పనులకు వెళుతున్నాడు. ఆరు నెలల క్రితం శివను కూడా పెద్ద కొడుకు వద్దకు తల్లిదండ్రులు పంపించారు. అయితే అనంతపురంలో ఉండలేనని, ఊరికి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటానని శివ తల్లిదండ్రులకు చెప్పేవాడు. వ్యవసాయం కంటే సెంట్రింగ్‌ పనులతోనే ఎక్కువ డబ్బులొస్తాయని నచ్చజెప్పారు. ఈ క్రమంలో అనంతపురం శారదానగర్‌లో శుక్రవారం ఉదయం సెంట్రింగ్‌ పనులకు అందరూ వెళ్లారు. బాత్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి 11.30 గంటల సమయంలో హమాలీకాలనీలో గదికి శివ వెళ్లాడు. రెండు సెల్ఫీలు తీసుకుని, ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. శివ ఎంత సేపటికీ రాకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నాగేంద్ర గదికి వెళ్లి చూసే సరికి శివ చనిపోయి ఉన్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై అనంతపురం టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 05:20 AM