Minister Roja: నగరిలో రోజా నామినేషనా.. మజాకా? 250 కేసుల మద్యం డంప్..
ABN, Publish Date - Apr 19 , 2024 | 12:26 PM
మంత్రి రోజా నామినేషన్ అంటే ఎలా ఉంటుంది? దుమ్ము లేచిపోతుందో లేదో కానీ లిక్కర్ మాత్రం పొంగి పొర్లుతోంది. పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్ చేయడం జరిగింది. సుమారు 250 కేసుల మద్యాన్ని ఒక ప్రైవేటు కళాశాలలో వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు డంప్ చేశారు. రాత్రి ఒంటి గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు.
తిరుపతి: మంత్రి రోజా (Roja) నామినేషన్ అంటే ఎలా ఉంటుంది? దుమ్ము లేచిపోతుందో లేదో కానీ లిక్కర్ మాత్రం పొంగి పొర్లుతోంది. పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్ చేయడం జరిగింది. సుమారు 250 కేసుల మద్యాన్ని ఒక ప్రైవేటు కళాశాలలో వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు డంప్ చేశారు. రాత్రి ఒంటి గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు. కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుంచి మంత్రి రోజా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. అయినా సరే.. పోలీసులు మాత్రం కేసు జోలికి వెళ్లడమే లేదు.
YS Jagan: సొంత జిల్లాలోనే సీఎం జగన్‌కు బొమ్మ పడుతోంది!!
నగరి నియోజకవర్గం నుంచి రోజా గత ఎన్నికల్లో రెండో సారి కూడా విజయం సాధించారు. కేవలం ఆమె నోటి దురుసుతోనే రాజకీయాల్లో పైకొచ్చారంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్ష నేతలపై నోరేసుకుని పడిపోతారు. నోటికి ఏ మాటొస్తే ఆ మాట అంటారు. అయితే రెండు సార్లు విజయం సాధించినా ఆమె నగరికి ఒరగబెట్టిందేమీ లేదు. గత ఎన్నికలకు ముందు రోజా వేరు.. ఎన్నికల తర్వాత రోజా వేరు. అంతకు ముందు అప్పుల్లో ఆమె కుటుంబం కూరుకుపోయింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె దశ మారిపోయింది. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టేసి తన కుటుంబ అభివృద్ధిని మాత్రమే చూసుకున్నారని టాక్. 2019 తర్వాత అప్పులన్నీ ఎగిరిపోయి.. వందల కోట్ల ఆస్తులను రోజా కూడబెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇవి కూడా చదవండి...
AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..
Chandrababu: విజయనగరం జిల్లాకు చంద్రబాబు.. పవన్
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 19 , 2024 | 12:41 PM