ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan London Trip: 4 గంటలు ఆలస్యంగా లండన్‌కు జగన్‌.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది..!?

ABN, Publish Date - May 19 , 2024 | 03:49 AM

ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్‌ విమానాశ్రయంలో దిగింది..

YS Jagan London Tour

  • ల్యాండింగ్‌కు అనుమతి లేక తొలుత.. ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు

  • తర్వాత లండన్‌కు చేరుకున్న విమానం

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్‌ విమానాశ్రయంలో దిగింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్‌ కుటుంబ సభ్యులు బయలుదేరిన విమానం శనివారం ఉదయం 10.30 గంటలకు లండన్‌లోని లూటాన్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ఎయిర్‌ట్రాఫిక్‌ కారణంగా ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో 47 నిమిషాలు విమానం గాల్లో చక్కర్లు కొట్టి.. తర్వాత నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో దిగింది.

మధ్యాహ్నం 1:30 గంటల వరకు జగన్‌ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్‌కు అనుమతి రావడంలో మళ్లీ లండన్‌ బయల్దేరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు లూటాన్‌ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయింది. జగన్‌ కుటుంబం లండన్‌కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500 విమానాన్ని గన్నవరం విమానాశ్రయానికి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన జగన్‌ తిరిగి తాడేపల్లికి రానున్నారు.

Read Latest National News and Telugu News


Updated Date - May 19 , 2024 | 07:50 AM

Advertising
Advertising