ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: చావనైనా చస్తాం గానీ.. భూములివ్వం!

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:14 AM

బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్‌ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులకు

ప్రభుత్వమిచ్చిన భూములివి

20న జవహర్‌రెడ్డి వచ్చి

ఆ భూములు చూసి వెళ్లారు

30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి

భూముల స్వాధీనానికి ప్రయత్నం

తూడెం గ్రామస్థుల ఆరోపణ

మే 20న జవహర్‌రెడ్డి వచ్చి

ఆ భూములు చూసి వెళ్లారు

30న రెవెన్యూ, పోలీసులు,

స్థానిక పెద్దల సాయంతో కొందరు రౌడీలు

వచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నం

భోగాపురం మండలం తూడెం గ్రామస్థుల ఆరోపణ

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): బినామీల పేరిట వందల ఎకరాల అసైన్డ్‌ భూములు సొంతం చేసుకున్నా రంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగుచూస్తూనే ఉంది. అయినప్పటికీ.. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

అధికారులు, పోలీసుల సాయంతో కొందరు రౌడీలను వెంటేసుకుని అసైన్డ్‌ భూములు ఇవ్వాల్సిందేనని బెదిరిం పులకు దిగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆయన బినామీ త్రిలోక్‌ ప్రోద్బలంతో కొందరు భూము లు ఇవ్వాల్సిందిగా తమను బెదిరిస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామస్థులు శుక్రవారం ఆరోపించారు.

ఐదు దశాబ్దాల కిందట ప్రభుత్వం తమ పూర్వీకులకు, ప్రస్తుత విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం ప్రాంతంలో భూములు (డి.పట్టాలు) ఇచ్చిందని, వాటిల్లో తోటలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు. అయితే గురువారం రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానికంగా ఉన్న గ్రామ పెద్దల సాయంతో కొందరు రౌడీలను వెంటేసుకుని వచ్చి త్రిలోక్‌కు భూములు అప్పగించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెప్పారు.


తూడెం గ్రామానికి చెందిన రైతులు దువ్వి అప్పన్న, జీరు చిట్టితల్లి, కొయ్య నరసమ్మ, వరలక్ష్మి, డెక్కతి సోంబాబు, జీరు వెంకటరావు, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్‌ శుక్రవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

మే 20న ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నవరం వచ్చి భూములు చూసి వెళ్లారని.. ఆ తర్వాతే రెవెన్యూ, పోలీసులు, వైసీపీ నేతలు, స్థానిక నాయకులు, రౌడీలు తమ తోటల స్వాధీనానికి ప్రయత్నిం చారని చెప్పారు.

త్రిలోక్‌ మనుషులమంటూ వారిలో కొందరు వచ్చి గురువారం తమను బెదిరించారన్నారు. వీరికి స్థానిక సర్పంచ్‌ మైలపిల్లి యల్లాజీ, మాజీ సర్పంచ్‌ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుని కుమారుడు, మరికొందరు అండగా నిలిచి తమపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. డీ.పట్టాల రెగ్యులేషన్‌కు ఇచ్చిన జీవో మేరకు భూములు వేరేవారికి చెందుతాయని అధికారులు చెబుతున్నారని, కోర్టుకు వెళ్లినా చెల్లదని బెదిరిస్తున్నారని అన్నారు. ఆ భూములు తమవేనంటూ అన్నవరం గ్రామానికి చెందిన కొందరు పెద్దలు వాటిచుట్టూ ఫెన్సింగ్‌ వేయడానికి సిమెంట్‌ స్తంభాలు, ఇనుప వైరు తీసుకొచ్చారని, దీంతో తామంతా కలిసి వారిని ఎదిరించామని చెప్పారు.

ప్రస్తుతం తాము భోగాపురం మండలం తూడెం గ్రామంలో నివాసం ఉంటున్నా 1970లో ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు అన్నవరం రెవెన్యూ పరిధిలో తమ తాత, తండ్రులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో జీడి, మామిడి, నీలగిరి తోటలు పెంచుకుని జీవిస్తున్నామన్నారు. తాతల నుంచి వారసత్వంగా లభించిన భూములను తాము ఎవరికీ అమ్మలేదని స్పష్టం చేశారు.

నాలుగేళ్ల క్రితం ల్యాండ్‌ పూలింగ్‌ కోసం వీఎంఆర్‌డీఏ నోటీసులిస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని గుర్తుచేశారు. ఒక పక్క స్టే ఉండగానే మధ్యలో అకస్మాత్తుగా త్రిలోక్‌ దన్నుతో రౌడీలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి భూములు స్వాధీనానికి యత్నించారన్నారు.


తమకు ఆ తోటలే జీవనాధారమని.. చావనైనా చస్తాం గానీ.. ఆ భూములను ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్‌, ఇతర అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

  • జీవో అడ్డంపెట్టుకుని అక్రమాలు: మూర్తి యాదవ్‌

సీఎస్‌ జవహర్‌రెడ్డి బినామీలైన త్రిలోక్‌, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, సుభాష్‌ విశాఖ పరిసరాల్లో రైతుల నుంచి బలవంతంగా డీపట్టా భూములు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఐదారు రోజుల నుంచి తాము చెబుతూ వస్తున్నామని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ అన్నారు.

గతేడాది ప్రభుత్వం ఇచ్చిన జీవో 596ను అడ్డం పెట్టుకుని డీ.పట్టా భూములకు ఫ్రీహోల్డ్‌ అనుమతులు తీసుకుని తర్వాత తమ బినామీల పేరిట రిజిసే్ట్రషన్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు దగ్గరలో అన్నవరం గ్రామంలో విలువైన డి.పట్టా భూములపై సీఎస్‌ జవహర్‌రెడ్డి, అతని బినామీ త్రిలోక్‌ కన్ను పడిందన్నారు. దళిత, పేద రైతులను బెదిరించి అసైన్డ్‌ భూములు కొట్టేసిన జవహర్‌రెడ్డి, అతని తరఫున బ్రోకర్‌ పై చర్యలు తీసుకోవాలన్నారు. జవహర్‌రెడ్డి, కలెక్టర్‌ మల్లికార్జులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 01 , 2024 | 04:14 AM

Advertising
Advertising