ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఎస్పీఎ‌‌ఫ్‌కు పోలీసు లోగో

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:29 AM

సాయుధ పోలీసు బలగాల యూనిఫామ్‌ ప్యాటర్న్‌ మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్)కు కూడా ఆ మేరకు అనుమతిచ్చింది.

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సాయుధ పోలీసు బలగాల యూనిఫామ్‌ ప్యాటర్న్‌ మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎ్‌ఫ)కు కూడా ఆ మేరకు అనుమతిచ్చింది. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఏపీఎస్పీ లాంటి విభాగాల్లోనూ విజిల్‌ కార్డ్‌, బెల్ట్‌ లాంటి వాటి రంగులు మార్చి పోలీసు కానిస్టేబుల్‌తో సమానంగా కనిపించేలా మార్చు చేయాలన్న వినతికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఇదే సమయంలో ఎస్పీఎఫ్‌ సిబ్బంది గౌరవాన్ని పెంచేలా పోలీసు లోగో ఇవ్వాలంటూ ఎస్‌పీఎఫ్‌ డీజీ త్రివిక్రమ్‌ వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సమ్మతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తలపై బ్యారెట్‌ క్యాప్‌ బదులు పీక్‌ క్యాప్‌, నడుముకు బ్రౌన్‌ బెల్ట్‌ స్థానంలో బ్లాక్‌ బెల్ట్‌తోపాటు భుజంపై లోగో మార్పునకు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఎస్‌పీఎఫ్‌ లోగోలో.. ప్రొటెక్షన్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌ అంటూ మూడు సింహాల కింద కలశం బొమ్మ ఉంది. కొత్త దాంట్లో మూడు సింహాల కింద ఏపీ పోలీస్‌ గద్ద బొమ్మతోపాటు ఎస్‌పీఎఫ్‌ అని ఉంటుంది. ‘ఆల్వేస్‌ డిఫెండింగ్‌’ అంటూ లోగోలో కొత్తగా ట్యాగ్‌లైన్‌ రాబోతోంది.

Updated Date - Aug 09 , 2024 | 04:29 AM

Advertising
Advertising
<