ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : బుడమేరులో రంగంలోకి సైన్యం

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:59 AM

వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి.

  • 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక

  • యుద్ధ ప్రాతిపదికన మూడో గండి పూడ్చే పనులు

  • నేటి ఉదయానికి పూర్తయ్యే అవకాశం

  • 3 రోజులుగా మంత్రి నిమ్మల అక్కడే

అమరావతి-ఆంధ్రజ్యోతి/జి.కొండూరు, సెప్టెంబరు 6: వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన మూడో గండి పూడ్చివేత శనివారం ఉదయానికి పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ పల్లపు ప్రాంతాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరంగా చేసేందుకు బుడమేరు వరద గండ్ల ద్వారా విజయవాడ వైపు రాకుండా చేయాల్సి ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలోకి దించారు.

మద్రాసు 6వ బెటాలియన్‌ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. తాత్కాలికంగా ఇనుప రాడ్లతో వంతెనలా కట్టారు. అందులో భారీ రాళ్లు వేసి పూడుస్తున్నారు. గేబియాస్‌ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టల్లా చేసిన దానిలో పెద్ద పెద్ద రాళ్లతోనూ ..ఇసుకతోనూ నింపుతారు) ద్వారా వారు గండ్లు పూడుస్తున్నారు. ఈ బుట్టలను పటిష్ఠం చేసేందుకు 4 మీటర్ల వరకూ రక్షణ కట్టకడతామని ఆర్మీ, జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 4వ కిమీ వద్ద 60 మీటర్లు, 4.1 కిమీ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో 4.1, 4 కిమీ వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేశారు.


3.9వ కిమీ వద్ద పడిన 100 మీటర్ల గండిని ఆర్మీ జవాన్లు సాయంత్రానికి 20 శాతం వరకు పూడ్చారు. గురువారం ఉదయం కేవలం 4,500 క్యూసెక్యుల ఉన్న నీరు.. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గురువారం సాయంత్రానికి 9 వేలకు చేరుకుంది. వరద పెరిగినా, వర్షం ఆటంకం కలిగించినా, కట్టలు జారుతున్నా పనులు మాత్రం ఆపకుండా ముందుకు కొనసాగిస్తున్నారు.

శుక్రవారం పగలు కాస్త పొడి వాతావరణం ఉండడంతో పనులు వేగంగా సాగాయి. రాత్రి బుడమేరుకు 2,500 క్యూసెక్యుల వరదే వస్తోంది. కానీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయానికి గండిని పూర్తిగా పూడ్చివేయగలమని అధికారులు అంటున్నారు. కాగా.. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మూడ్రోజులుగా బుడమేరు కాలువ వద్దే ఉన్నారు. ఎండనకా వాననకా అక్కడే ఉండి గండ్ల పూడ్చివేతను పర్యవేక్షిస్తున్నారు. మొదటి రెండు గండ్ల పూడ్చివేత ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది.

Updated Date - Sep 07 , 2024 | 05:00 AM

Advertising
Advertising