Share News

22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:46 AM

అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్‌ చెప్పారు.

22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

మంగళగిరిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధుల రాక

5 వేల డ్రోన్‌లతో 22న కృష్ణా తీరంలో డ్రోన్‌ హ్యాకథాన్‌

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్‌ చెప్పారు. ఈ సదస్సును మంగళగిరిలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని, ముఖ్యఅతిథిగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు హాజరవుతారని తెలిపారు. సదస్సుకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది డ్రోన్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని డ్రోన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన 5 వేల డ్రోన్‌లతో హ్యాకథాన్‌ను కృష్ణా నదీ తీరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రోన్‌ హ్యాకథాన్‌లో పాల్గొన్న వారికి మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండవ బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష చెల్లిస్తామని ప్రకటించారు. డ్రోన్‌ సమ్మిట్‌, డ్రోన్‌ హ్యాకథాన్‌ లోగోలు, వెబ్‌సైట్‌లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ ఎండీ దినేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 03:49 AM