ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : మారుమూల ప్రాంతాలకు న్యాయ సేవలు

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:42 AM

రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

వసతుల కల్పనకు త్రికరణశుద్ధితో పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వం

హైకోర్టులో ఆగస్టు 15 వేడుకల్లో సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

చట్టసభల్లో ఫలప్రదమైన చర్చలు జరగాలి: స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీజే మాట్లాడుతూ... ‘సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని, అవరోధాలను అధిగమించే దశలో దేశ న్యాయవ్యవస్థ ఉంది. మారుమూల ప్రాంతాలకు న్యాయసేవలను తీసుకెళ్లేందుకు, న్యాయవ్యవస్థ శక్తివంతంగా పనిచేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు ఏపీ ప్రభుత్వం త్రికరణశుద్ధితో పనిచేస్తుంది’ అని అన్నారు.

హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.చిదంబరం, బార్‌ కౌన్సిల్‌ చైౖర్మన్‌ ఎన్‌.ద్వారకానాథ్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... ‘స్వాతంత్య్ర ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారు. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశంలో జనాభా సంఖ్యకు తగ్గట్లు న్యాయమూర్తుల సంఖ్య లేదు. ఈ కారణంగా కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఏపీలో న్యాయమూర్తుల ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి’ అని అన్నారు.


ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి: స్పీకర్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతి అసెంబ్లీ ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ‘ప్రతి పౌరుడు దేశంపట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలి. చట్టసభల్లో ప్రజాసమస్యలపై ఫలప్రదమైన చర్చలు జరగాలి’ అని ఆకాంక్షించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు మాట్లాడుతూ... ‘ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన పేదలందరికీ అందాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ అని అన్నారు.

న్యూఢిల్లీ ఏపీ భవన్‌లో...

దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌, అడిషనల్‌ కమిషనర్‌ హిమాంశు కౌశిక్‌ అధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.

Updated Date - Aug 16 , 2024 | 04:42 AM

Advertising
Advertising
<