ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : టారిఫ్‌కు కట్టడి !

ABN, Publish Date - Jul 10 , 2024 | 03:00 AM

రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్తు రంగంలో 3.0విధానం అమలుచేస్తామనీ, టారి్‌ఫను నియంత్రిస్తామనీ వెల్లడించారు.

CM Chandrababu Naidu

  • కోతల్లేని కరెంటు ఇస్తాం..

  • ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌..

  • శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం

  • జగన్‌ తీరుతో వినియోగదారులకు నరకం

  • పేదోళ్లపై భారంవేసి పెత్తందార్లకు మేలు

  • పీపీఏలను రద్దు చేయబోం

  • గృహాలకు స్మార్ట్‌ మీటర్లపై సమీక్షిస్తాం

  • వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్‌ మీటర్లపై

  • త్వరలో నిర్ణయం.. సోలార్‌ ప్యానళ్ల యోచన

  • సామాన్యులు, మేధావులు, మీడియా

  • సలహాలు తీసుకుంటాం: చంద్రబాబు

‘‘జగన్‌ చేసిన పనులతో రాష్ట్రం విష వలయంలో కూరుకుపోయింది. బొగ్గు కొనకపోతే కరెంటు ఉండదు. బొగ్గు కొనడానికి డబ్బులు కావాలి. విద్యుత్‌ సంస్థలను పీకల్లోతు అప్పుల్లో దించి పోయారు. ఖజానాలో డబ్బులు లేవు. అప్పులు రావు. అయినా నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. కోతలు రానీయకూడదు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం’’

- చంద్రబాబు

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్తు రంగంలో 3.0విధానం అమలుచేస్తామనీ, టారి్‌ఫను నియంత్రిస్తామనీ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఇంధనరంగంపై ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో కోతల్లేని కరెంటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని తనకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను చూస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్తు సరఫరాపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామనీ, ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు కోతలు ఉంటే .. సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


గత వైసీపీ పాలనలో పేదోడిపై భారం వేసేలా విద్యుత్తు చార్జీలు ఉన్నాయన్నారు. తరచూ తాను పేదోడినని చెప్పుకునే జగన్‌.. విద్యుత్తుచార్జీల విషయంలో పేదోళ్లపైనే భారం వేసేలా టారిఫ్‌ వసూలు చేశారన్నారు. తెలుగుదేశం హయాంలో 50 యూనిట్ల వరకూ 101 రూపాయలను వసూలు చేస్తే .. జగన్‌ జమానాలో 98 శాతం పెంపుదల చేసి 199 రూపాయలు చేశారని విమర్శించారు. నెలకు 100 యూనిట్లను వాడేవారిపై టీడీపీ హయాంలో రూ.244 వసూలు చేస్తే, జగన్‌ ప్రభుత్వం 86 శాతాన్ని పెంచి రూ453ను వసూలు చేసిందన్నారు.

అదేవిధంగా 200 యూనిట్లను వాడేవారిపై టీడీపీ సర్కారు 632 రూపాయలు వసూలు చేస్తే .. జగన్‌ జమానాలో 78 శాతం పెంచి రూ.1123 వసూలు చేశారని వివరించారు. ఈ విధంగా పేద, మధ్య తరగతి వర్గాలపై 78 నుంచి 98 శాతం చార్జీలను పెంచిన జగన్‌ .. 300 యూనిట్లపైబడి కరెంటువాడే సంపన్నులపై కేవలం 29శాతం పెంపుదలతో రూ.2037 చార్జీలను వసూలు చేశారన్నారు. ఈ విధానాన్ని బట్టి జగన్‌ పెత్తందారీ విధానాలు అమలు చేశారని అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో పేద, మధ్యతరగతి వర్గాలపై చార్జీలను వేయడంవల్ల కోటి 53లక్షల మంది వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు.


ట్రూఅప్‌పై నిర్ణయం తీసుకోలేదు

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా కేంద్రం ప్రకటించిందని చంద్రబాబు తెలిపారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ నిర్మించదలచిన థర్మల్‌ విద్యుత్కేంద్రానికి బదులు గ్రీన్‌హైడ్రోజన్‌ ప్లాంటును ఏర్పా టు చేస్తామంటూ ప్రతిపాదించిందని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌మిషన్‌ లైన్లను వేయాల్సి ఉందన్నారు.

ఇంధన రంగంలో హైబ్రీడ్‌ విధానాలను అమలు చేస్తామన్నారు. ఎక్కడికక్కడ గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను తగ్గించేందుకు వీలుందని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలను తీసుకుంటామని చెప్పారు. జగన్‌ జామానాలో విద్యుత్తు రంగానికి రూ.1,29,503 కోట్ల మేర నష్టాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నష్టాలు పూడ్చాలని కేంద్రాన్ని కోరలేమన్నారు. జగన్‌ ప్రభుత్వంలోని రూ.17,000 కోట్ల ట్రూఅప్‌ చార్జీలపై ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదన్నారు.


మీటర్లపై నిర్ణయం తీసుకోలేదు..

గృహాలకు స్మార్ట్‌మీటర్ల బిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, ఇప్పటికే వ్యవసాయ పంప్‌సెట్లకు బిగించిన మీటర్లపైనా త్వరలోనే సమీక్ష జరుపుతామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ పంప్‌ సెట్లకు మీటర్లను బిగించిన వాటిని ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్‌ ప్యానళ్లను బిగించే కార్యక్రమాన్ని అమలుచేసే యోచనలో ఉన్నామన్నారు. ఈ పథకం వల్ల నాలుగేళ్లలో ప్రయోజనం కనిపిస్తుందని వివరించారు.

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో (సెకీ) డిస్కమ్‌లు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయబోమని, దానివల్ల న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవుతాయని చెప్పారు. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుదుత్పత్తి కేంద్రాలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయడంపైనా నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘‘వీటన్నింటిపైనా కూలంకషంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం ఉంది. ఈ పథకాల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది’’ అని చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల నుంచి వసూలు చేసిన సెస్‌లో కొంత భాగమే, విద్యుత్తు రంగానికి వెళ్లిందని చెప్పారు. విద్యుత్తురంగంపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మేధావులు, సామాన్యులు , మీడియా ప్రతినిధుల నుంచి దీనిపై సలహాలు తీసుకుంటామన్నారు. విద్యుత్తు రంగాన్ని గాడిలో పెట్టగల విశ్వాసం తనకుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.


‘సమర్ధ పాలన ఉంటే పేదలు కూడా బాగుపడతారు. వాళ్ల జీవితాలు మెరుగుపడాలి. లేకపోతే వారి జీవితాలు మరింత నాశనం అవుతాయి. గత దుష్పరిపాలన వల్ల ఎంత నష్టం జరిగిందో తెలియడానికే ఈ కసరత్తు (శ్వేతపత్రాల విడుదల) చేపట్టాం’’

‘‘తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కా దిగా సరిపోయిందని నానుడి. అదే మాదిరిగా వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన నిర్ణయాలతో వ్యవస్ధలను నాశనం చేసింది. సౌర విద్యుత్‌ కంపెనీలతో తగాదా పెట్టుకొని వాళ్ల వద్ద కరెంటు తీసుకోలేదు. ఎంతో ఖర్చు పెట్టి బయట కొన్నారు. చివరకు కరెంటు తీసుకోకపోయినా సౌర విద్యుత్‌ కంపెనీలకు ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి వచ్చింది. ప్రజల సొమ్మును వృథా చేశారు’’

- చంద్రబాబు


Also Read:

లావణ్యపై మాల్వి మల్హోత్రా ఫిర్యాదు

నేడు 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన ఓటింగ్

5 సెకెన్లలో దీన్ని పరిష్కరిస్తే మీరే తోపు..

For More Andhra Pradesh and Telugu News..

Updated Date - Jul 10 , 2024 | 09:26 AM

Advertising
Advertising
<