Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే
ABN, Publish Date - Jul 17 , 2024 | 07:32 PM
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
కాకినాడ, జులై 17: ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారన్నారు.
Also Read:Madhya Pradesh: పాపం.. న్యాయం కోసం రైతు పొర్లు దండాలు
కాపుల కోసం.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడిపి వ్యక్తి ముద్రగడ పద్మనాభమని గుర్తు చేశారు. రాజకీయాల్లో నష్టపోయినా.. ఏనాడు కులాన్ని మాత్రం ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థుల సవాల్‌ను స్వీకరించి తన పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ అని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆయన్ని అభినందించేందుకు తాను కిర్లంపూడి వచ్చినట్లు మాజీ మంత్రి వివరించారు. అలాగే ముద్రగడకు తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు వివరించారు.
Also Read: Bengaluru: రైతును అవమానించిన మాల్ సిబ్బంది
Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటానని ఎన్నికల ప్రచార వేళ ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌కు ఓటు వేసి గెలిపించారు. ఈ నేపథ్యంలో ప్రకటన ప్రకారం పేరు మార్చుకోవాలంటూ ముద్రగడపై సోషల్ మీడియాలో ఒత్తిడి పెరిగింది. దాంతో ఆయన అన్నట్లుగానే తన పేరును మార్చుకున్నారు.
Also Read: Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు
Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ
మరోవైపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి కోసం ప్రత్యర్థి పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో నిలిపింది. అంతేకాదు.. నాటి సీఎం వైయస్ జగన్ సైతం.. తన ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలోనే నిర్వహించిన విషయం విధితమే.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 17 , 2024 | 07:59 PM