ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:00 AM

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.

  • ఇదిగో ఆధారం: ఆనం

  • కేంద్ర ప్రభుత్వ లేబొరేటరీ నివేదిక చూపిన ఆనం

  • ఆ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, మైదానూ కలిపారు

  • కమీషన్లకు కక్కుర్తిపడే వైసీపీ నేతల అక్రమాలు: ఆనం

నెల్లూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబొరేటరీ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయిందని తెలిపారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వంలో లడ్డూలు కంపు కొడుతున్నాయి. లడ్డూ నాణ్యత సరిగా లేదని, చర్యలు తీసుకోవాలని అనేకమంది భక్తులు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ఇన్‌ పెట్టినప్పుడు కూడా ఈవోకు అనేకమంది చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లడ్డూలు, ప్రసాదాలు, భోజనాల నాణ్యతపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఎన్‌డీఆర్‌ఐ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డీ సురేంద్రనాథ్‌, డెయిరీ ఎక్స్‌పర్ట్‌ విజయభాస్కర్‌రెడ్డి, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ డి. స్వర్ణలతతో ఈ కమిటీ ఏర్పాటైంది.

కమిటీ విచారణలో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. అప్పటివరకూ నెయ్యి సరఫరా చేసినవారిని వైసీపీ ప్రభుత్వంలో మార్చేశారు. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాళ్లు లంచాలు ఇవ్వరు కాబట్టి మార్చారు. మంచి ఆవు నెయ్యి కేజీ ధర రూ.వెయ్యికి తక్కువ లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో టెండర్‌ పిలిచి రూ.320కే సరఫరా చేసేలా నలుగురికి కాంట్రాక్ట్‌ అప్పగించారు. ఇంత తక్కువ ధరకు ఎవరైనా సరఫరా చేయగలరా? ఇందులో భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పాత్రధారులు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు తిరుమలలో ల్యాబ్‌ పెడితే వీరి బాగోతం బయటపడుతుందని ఆ గోవిందుడినే మోసం చేశారు.


ఈ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయవచ్చా..? ఏఆర్‌ ఫుడ్స్‌ అనే కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. అక్కడినుంచి వచ్చిన ఒక ట్రక్కు నెయ్యిని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ ల్యాబ్‌కు పరీక్షకు పంపారు. 52 ఐటమ్స్‌ను అక్కడ అనాలసిస్‌ చేసి రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ నెయ్యిలో సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ సీడ్‌, మైదా, కోకోనట్‌తో పాటు చేప నూనె కూడా ఉన్నట్లు రిపోర్టులో తేలింది. పామాయిల్‌, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయింది. నాణ్యమైన నెయ్యికి ‘ఎస్‌’ విలువ 95.8 నుంచి 104.32 మధ్య ఉండాలి. కానీ ఇక్కడ ఒక శాంపిల్‌ విలువ 19.72 ఉంది. మరో శాంపిల్‌కు 19.77 వచ్చింది. అంటే ఒరిజినల్‌ నెయ్యి నాణ్యతలో 20శాతం కూడా లేదని తేలింది. వేంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కుళ్లిపోయిన జంతువుల నుంచి తీసిన నెయ్యిని వాడతారా? ఇది ఎంత అన్యాయం? ఇదేనా వైసీపీ పాలన? తిరుమలలో అన్యాయం జరుగుతోందని, వైఎస్‌ ఫ్యామిలీకి స్వామి మీద నమ్మకం లేదని మొదటినుంచీ చెబుతూనే ఉన్నాం.

తిరుమల వేంకటేశ్వరుడి వద్ద వేల సంవత్సరాల నుంచి జరగని తప్పు వైసీపీ రాక్షసులు చేశారు. కలియుగ దైవంతో పెట్టుకున్న ప్రతీఒక్కరూ సర్వనాశనం అయిపోతారు. హిందువులకు న్యాయం జరగాలంటే జగన్మోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలను ఉరి తీయాలి. చంద్రబాబు ఏదేదో మాట్లాడేశారని వైసీపీ నేతలు కూస్తున్నారు. ఇవిగో రుజువులు (ల్యాబ్‌ రిపోర్టులు చూపిస్తూ...). శ్రీవారిని నమ్ముకున్న ప్రతీ ఒక్క భక్తుడికీ జరిగిన అన్యాయం ఇది. మేము ఈ నెయ్యి సరఫరాను నిలిపేశాం. నందినీ డెయిరీ నెయ్యిని పునరుద్ధరించాం. కర్ణాటక ప్రభుత్వం కూడా తమకు లాభం వద్దు.. దేవుడికి తక్కువ ధరకు సరఫరా చేస్తామని ముందుకొచ్చారు. అంత భక్తితో కర్ణాటక ప్రభుత్వం ఉంటే వైసీపీ నాయకులు ఎవరెవరి దగ్గరకో వెళ్లి జంతువుల మాంసం కలిసిన నెయ్యి తీసుకురావడం దుర్మార్గం. వెంటనే టీటీడీని ప్రక్షాళన చేయాలి. జరిగిన తప్పును క్షమించాలని దేవుడిని వేడుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించి కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇవ్వడమనేది ఆ స్వామి రాసిన స్ర్కిప్టు. టీటీడీని అపవిత్రం చేసిన ప్రతీఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే..’ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌డీడీబీ నివేదిక ప్రతులను ప్రదర్శించారు.

Updated Date - Sep 20 , 2024 | 04:00 AM