ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP ELECTIONS : అన్నీ మంచి శకునములే!

ABN, Publish Date - May 12 , 2024 | 12:41 AM

ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు. అభివృద్ధి కనుమరుగైందని గుర్తించారు. ఒక్క చాన్స ఇచ్చినందుకు ఏం జరిగిందో కళ్లారా చూశారు. చైతన్యం పెరిగింది. అప్రమత్తమయ్యారు. ఇక మరోమాట లేదు.. బాబు వస్తేనే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. పోలింగ్‌కు ఇక 24 గంటలకు మించి సమయం లేదు. ఇప్పుడు జిల్లాలో ఎవరి నోట విన్నా టీడీపీ కూటమి మాటే వినిపిస్తోంది. అధికారం కూటమిదేనని ఘంటాపథంగా చెబుతున్నారు. అకృత్యాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలు, అవినీతికి చరమగీతం పాడుతామని ...

టీడీపీ కూటమికి అనుకూల వాతావరణం

అవినీతి.. అక్రమాలతో జనానికి దూరమైన వైసీపీ

బటన నొక్కుడు తప్ప.. కనిపించని అభివృద్ధి

గతంలో ఓడినా.. జనానికి చేరువగా టీడీపీ నేతలు

కూటమి అభ్యర్థుల్లో సూపర్‌ సిక్స్‌ జోష్‌

సర్వేలు కూడా టీడీపీ కూటమికే అనుకూలం

ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు. అభివృద్ధి కనుమరుగైందని గుర్తించారు. ఒక్క చాన్స ఇచ్చినందుకు ఏం జరిగిందో కళ్లారా చూశారు. చైతన్యం పెరిగింది. అప్రమత్తమయ్యారు. ఇక మరోమాట లేదు.. బాబు వస్తేనే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. పోలింగ్‌కు ఇక 24 గంటలకు మించి సమయం లేదు. ఇప్పుడు జిల్లాలో ఎవరి నోట విన్నా టీడీపీ కూటమి మాటే వినిపిస్తోంది. అధికారం కూటమిదేనని ఘంటాపథంగా చెబుతున్నారు. అకృత్యాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలు, అవినీతికి చరమగీతం పాడుతామని అంటున్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయినవారు, సొంతింటి కల చెదిరిపోయినవారు, సబ్సిడీ పరికరాలకు దూరమైన అన్నదాతలు.. పథకాల రద్దుతో నష్టపోయిన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు.. మరీ ముఖ్యంగా


ఉద్యోగులు.. ఉపాధ్యాయులు కూటమికి అనుకూలంగా పోటెత్తుతున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారానికి వచ్చిన కూటమి అభ్యర్థులను ఆదరించారు. మీకే మా మద్దతు అని బహిరంగపరిచారు. జగన మాటలను నమ్మి మోసపోయామని.. సూపర్‌ సిక్స్‌ సుపరిపాలన కోరుకుంటున్నామని అభ్యర్థుల వద్ద తమ ఆకాంక్షలను బయట పెట్టారు.

దగ్గుబాటికే అనుకూలం

అనంతపురం అర్బన నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అనంత వెంకటరామిరెడ్డి నెరవేర్చలేదన్న అసంతృప్తి అర్బన ఓటర్లలో ఉంది. డంపింగ్‌ యార్డును మార్చలేదు. భూగర్భ డ్రైనేజీని నిర్మించలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధాన రహదారులు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం మినహా.. నగర అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీనికి తోడు ఆయనకు ఇంటిపోరు తప్పడం లేదు. వైఎస్సార్‌కు సన్నిహితమైన


బీఎనఆర్‌, చవ్వా కుటుంబాలు, మైనార్టీ నేత నదీం, కీలక నాయకులు వైటీ శివారెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి.. ఇలా చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రచారాల్లోనూ వారి భాగస్వామ్యం దాదాపుగా లేదు. పదవుల్లో ఉన్న కొందరు సైతం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు వేల సంఖ్యలో ఉన్నారు. జగన ప్రభుత్వంపై వీరంతా వ్యతిరేకతతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కొత్త వ్యక్తి కావడంతో ఆ వర్గాలన్నీ అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో వేలాది మంది ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. సూపర్‌సిక్స్‌ పథకాలు దగ్గుబాటికి కలిసొచ్చే అంశం.

రాప్తాడు పరిటాలకు పదిలం

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుల దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులపై నియోజకవర్గ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. వారి తీరు కారణంగా మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎన్నికల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన పరిటాల సునీత, మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో ఒక్కచాన్స గాలిలో పరిటాల శ్రీరామ్‌ ఓడిపోయారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. జాకీ పరిశ్రమను


వెల్లగొట్టి వేలాది మంది మహిళలకు ఉపాధి లేకుండా చేశారు. మూడు రిజర్వాయర్లు నిర్మిస్తామని ఆర్భాటంగా శంకుస్థాపన చేసి.. వదిలేశారు. ఇవన్నీ వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌ రెడ్డికి వ్యతిరేకంగా మారాయి. టీడీపీ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత పోటీ చేస్తుండటంతో నియోజకవర్గంలో మరోమారు అభివృద్ధి చూడొచ్చన్న ఆశ ఓటర్లలో కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గం నాయకులు, కార్యకర్తలు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ప్రచారంలో పరిటాల సునీతకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పరిటాల కుటుంబాన్ని గత ఎన్నికల్లో ఓడించి తప్పు చేశామనే భావన ఆ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలలో ఉంది. సూపర్‌సిక్స్‌ పథకాలతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఆయన సోదరుల దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా పరిటాల సునీతవైపే ఆ నియోజకవర్గ ఓటర్లున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కళ్యాణదుర్గంలో సైకిల్‌దే హవా

కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆదినుంచి టీడీపీకి కంచుకోట. ఈసారి ప్రముఖ కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి అనంతపురం సిటింగ్‌ ఎంపీ తలారి రంగయ్య పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఉష శ్రీచరణ్‌.. మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను ఇక్కడి నుంచి తప్పించి పెనుకొండ నుంచి పోటీ చేయిస్తున్నారు. ప్రజలకు మంచి సేవలందించే వ్యక్తిగా అమిలినేని సురేంద్రబాబుకు జిల్లా వ్యాప్తంగా పేరుంది. కరోనా సమయంలోనూ ఆయన అనేక సేవలందించారు. స్వయాన కాంట్రాక్టర్‌ కావడంతో ఆయనే సొంతంగా అభివృద్ధి


పనులు చేస్తారన్న ఆశ ఆ నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ప్రచారంలో దూసుకుపోతున్నారు. వేలాది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. తలారి రంగయ్య ఎంపీ అయినా.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. నియోజకవర్గంలోని కొన్ని బలమైన సామాజికవర్గాలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో సైకిల్‌ హవా సాగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

శింగనమలలో శ్రావణిపై సానుభూతి

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం శింగనమలలో టీడీపీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ పట్ల ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా.. టీడీపీ అధినాయకత్వం ఆమెకే మళ్లీ అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే..! పెత్తనం మొత్తం ఆమె భర్త సాంబశివారెడ్డిదే. ఆయన భూముల కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ సామాజికవర్గంలోని కొందరికి పట్టం కట్టడంతో ఇతర సామాజికర్గం నేతలు అసంతృప్తితో దూరమయ్యారు. ఎస్సీ నియోజకవర్గమైనా.. దళిత నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. దీంతో జొన్నలగడ్డ పద్మావతికి కాకుండా... ఆమె


భర్త ఆలూరు సాంబశివారెడ్డి దగ్గర పనిచేసే వీరాంజనేయులుకు ఈ సారి టిక్కెట్‌ ఇచ్చారు. పార్టీలో పనిచేసిన దళిత నాయకులకు టిక్కెట్‌ ఇవ్వకపోవడం ఆ సామాజికవర్గ నేతలను మరింత అసంతృప్తిలోకి నెట్టింది. ఈ పరిణామాలు శ్రావణికి కలిసిరానున్నాయి. గత ఎన్నికల్లో ఓడినా.. ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు కలిసికట్టుగా శ్రావణి కోసం శ్రమిస్తున్నాయి.

ఉరవకొండ పయ్యావులకు అండ

ఉరవకొండలో టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు ఈ ఎన్నికల్లో పెద్దగా పోటీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ మూడింట గెలిచింది. అందులో కేశవ్‌ ప్రాతినిధ్యం వహించిన ఉరవకొండ ఒక్కటి కావడం విశేషం. 1994 నుంచి కేశవ్‌ ఉరవకొండ నుంచి క్రమం తప్పకుండా పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ నాలుగుసార్లు గెలిచారు.. రెండుసార్లు మాత్రమే ఓడిపోయారు. తాజాగా ఏడోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది. టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్‌, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి విశ్వ సోదరుడు మధుసూదనరెడ్డి తలపడుతున్నారు. విశ్వ తనయుడిపై


భూకబ్జాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు విశ్వా సోదరుడు మధుసూదనరెడ్డికి వైసీపీలో మంచి సంబంధాలున్నాయి. ఆయన వైసీపీ ఓట్లను భారీగా చీల్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలోని మరో ముఖ్యనేత వర్గం కూడా విశ్వాకు అనుకూలంగా పనిచేయడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నా.. హంద్రీనీవా నుంచి సాగునీరు అందించేందుకు విశ్వ చొరవ చూపలేదన్న అసంతృప్తి నియోజకవర్గ రైతుల్లో ఉంది. ఈ పరిణామాలు కేశవ్‌కు అనుకూలంగా మారనున్నాయి.

అశ్మితకు ఈజీ..

తాడిపత్రిలో జేసీ కుటుంబానికే అనుకూలత కలిపిస్తోంది. తాడిపత్రి జేసీ కుటుంబం కంచుకోట. అక్కడ ఓటమి ఎరుగరు. కానీ 2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవనరెడ్డి ఎంపీ అభ్యర్థిగా, జేసీ అశ్మితరెడ్డి తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేశారు. ఒక్కచాన్స వేవ్‌లో ఇద్దరూ ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో ఏకైక టీడీపీ మున్సిపల్‌ చైర్మనగా జేసీ ప్రభాకర్‌రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో మరోసారి అశ్మిత, పెద్దారెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గ, మున్సిపాలిటీ అభివృద్ధిని పెద్దారెడ్డి


విస్మరించారు. ఒకప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీకి జాతీయస్థాయి అవార్డు దక్కింది. ప్రస్తుతం దయనీయంగా ఉంది. మున్సిపల్‌ చైర్మన హోదాలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యే అడ్డుకోవడమే దీనికి కారణం. గ్రానైట్‌ పరిశ్రమ కుదేలు కావడానికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలే కారణం. వందలాది పరిశ్రమలు మూతపడి.. వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ఎన్నికల్లో గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు, కార్మికులు అశ్మితవైపు నిలబడ్డారు. పెద్దారెడ్డిని అంటిపెట్టుకున్న నాయకులు కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అశ్మిత రెడ్డికి ఇవన్నీ సానుకూలం.

గుమ్మనూరుకు గుంతకల్లులో అవకాశం

గుంతకల్లు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా టీడీపీ కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం బరిలోకి దిగారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. జగన మంత్రివర్గంలో చోటు సంపాదించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. గుంతకల్లు టిక్కెట్‌ను దక్కించుకున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో


గుమ్మనూరు సామాజికవర్గం వాల్మీకులు అధికంగా ఉన్నారు. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మరోసారి పోటీ లో ఉన్నారు. ఐదేళ్లలో ఆయన ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఇచ్చిన హామీలనుకూడా నెరవేర్చలేదు. ఇసుక, మట్టి మాఫియాలో ఎమ్మెల్యే బంధువులు కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొండలు, గుట్టలను కాజేసి రూ.కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ గుమ్మనూరుకు కలిసొస్తున్నాయి. మరోవైపు సూపర్‌ సిక్స్‌ పథకాలు ఉండనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు గుమ్మనూరుకు అవకాశమిచ్చే ప రిస్థితులు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 12 , 2024 | 12:41 AM

Advertising
Advertising