ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘అనంత’ను సొంత పార్టీ వారే ఓడిస్తారు

ABN, Publish Date - Apr 21 , 2024 | 12:33 AM

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పతనం ఆయన సొంత డివిజన నుంచే మొదలైందని, సొంత పార్టీ వారే ఆయన్ను ఓడించబోతున్నారని కూటమి అనం తపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.

EX CARPORATER JOIND IN TDP

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 20 : ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పతనం ఆయన సొంత డివిజన నుంచే మొదలైందని, సొంత పార్టీ వారే ఆయన్ను ఓడించబోతున్నారని కూటమి అనం తపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శనివారం స్థానిక 16వ డివిజనలోని తన నివాసంలో మాజీ కార్పొరేటర్‌ రహమత బీ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆమెతోపాటు వందమందికి దగ్గుబాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణలు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.


వైసీపీలో తనకు ఎలాంటి గుర్తింపు, న్యాయం జరగలేదని, అందుకే టీడీపీ చేరినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ... ఎమ్మెల్యే అనంతపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారని, వైసీపీ నుంచి వలసలే అందుకు నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ స్వరూప, నాయకులు లింగారెడ్డి, ముక్తియార్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 12:33 AM

Advertising
Advertising