ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ycp : దౌర్జన్యకాండ..!

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:46 AM

మండలంలోని చెదళ్ల గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్రమించిన వాటర్‌ ప్లాంట్‌, ట్రెంచను తొలిగించేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసులను అడ్డుకున్నారు. అక్రమణలు తొలిగించేందుకు వెళ్లిన ఎక్స్‌కవేటర్‌ను వైసీపీ మద్దతు సర్పంచ, అనుచరులు ధ్వంసం చేశారు. పోలీసులు చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ ...

YCP mobs blocking officials in Chedalla village

రెచ్చిపోయిన వైసీపీ మూకలు

ఆక్రమణను తొలిగించేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న సర్పంచ

ఎక్స్‌కవేటర్‌ ధ్వంసం

టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు

మహిళలపై దాడి

చెదళ్ల గ్రామంలో ఉద్రిక్తత

బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 17: మండలంలోని చెదళ్ల గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్రమించిన వాటర్‌ ప్లాంట్‌, ట్రెంచను తొలిగించేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసులను అడ్డుకున్నారు. అక్రమణలు తొలిగించేందుకు వెళ్లిన ఎక్స్‌కవేటర్‌ను వైసీపీ మద్దతు సర్పంచ, అనుచరులు ధ్వంసం చేశారు. పోలీసులు చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ ఘటనతో సంబంధంలేని ముగ్గురు టీడీపీ మహిళా కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేసి, గాయపరిచారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెదళ్ల గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ శ్రీనివాసులు రెడ్డి ప్రభుత్వ స్థలం 7 సెంట్లు ఆక్రమించి, వాటర్‌ ప్లాంట్‌ను గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలాన్ని గతంలోనే మహిళా సాధికారిత భవనానికి కేటాయించారు. అలాంటి స్థలంలో వాటర్‌ ప్లాంట్‌ ఎలా నిర్మిస్తారని టీడీపీ నేతలు.. జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మంగళవారం రెవెన్యూ అధికారులు,


పోలీసులు.. ఆక్రమణను తొలిగించేందుకు చెదళ్ల గ్రామానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ సర్పంచ శ్రీనివాసులు రెడ్డి, అతడి అనుచరులు.. అధికారులును అడ్డుకున్నారు. ఎలా తొలగిస్తారని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త యరపరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డబ్బా తీసుకుని తహసీల్దార్‌, సీఐ ముందుకు వచ్చి బెదిరించాడు. పోలీసులు.. అతడి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఈ సమయంలో క్రిమిసంహారక మందు డబ్బా పగిలిపోయి, తహసీల్దార్‌, సీఐ కరుణాకర్‌పై పడింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మందును క్లీన చేశారు.

మహిళలపై దాడి

వాటర్‌ ప్లాంట్‌ తొలిగింపు ఘటనకు సంబంధం లేని టీడీపీ మహిళా కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తలు చౌడమ్మ, నాగలక్ష్మి, పద్మావతి పుట్టినరోజు వేడుకులకు వెళ్తుండగా అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. వాటర్‌ ప్లాంట్‌ తొలిగించాలని ఫిర్యాదు చేస్తారా? ఎంత ధైర్యం అంటూ దాడికి తెగబడ్డారు. పోలీసులు ఉన్నా దాడిని అడ్డుకోలేకపోయారని టీడీపీ నేతలు వాపోయారు. గాయపడిన వారిని అనంతపురం సర్వజన అస్పుత్రికి తరలించారు.

టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు

రోడ్డు వైపు ఉన్న టీడీపీ మాజీ సర్పంచ నారాయణస్వామి, ఆయన వర్గీయలపై వైసీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. దమ్ముంటే రండి అంటూ సవాల్‌ విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. ప్రస్తుతం గ్రామంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:46 AM

Advertising
Advertising