DEVOTIONAL : భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:13 AM
స్థానిక అరవిందనగర్ సర్వేశ్వ రాలయంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి మండల పూజలో భాగంగా గురువారం పడిపూజను భక్తిశ్రద్ధలతో ని ర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పడిపై వినా యకు, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి చిత్రపటాలను విశేషంగా అలంకరించి పూజలు చేశారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : స్థానిక అరవిందనగర్ సర్వేశ్వ రాలయంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి మండల పూజలో భాగంగా గురువారం పడిపూజను భక్తిశ్రద్ధలతో ని ర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పడిపై వినా యకు, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి చిత్రపటాలను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం దీక్షధారులకు భిక్షను అందజేశారు. ఆలయ ప్రధానార్చకుడు గురుమూర్తి, భక్త బృందం పాల్గొన్నారు.
తిరుప్పావై పఠనం
ధనుర్మాసోత్సవాలను పురస్క రించుకుని గురువారం అశోక్‌నగర్‌లోని రమా సమేత సత్యనారాయణస్వామి దేవాలయంలో తిరుప్పావై పఠనాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్లకు ఫలపం చామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా తిరుప్పావై పాశురాలు పఠించారు. కార్యక్రమంలో ఆలయ కార్యవర్గం, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 20 , 2024 | 12:13 AM