ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VILLAGE : సంపద సృష్టి జరిగేనా..?

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:25 AM

గత ఐదేళ్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంపద సృష్టి ఏమో గాని ప్రజా ధనం చెత్తలో కలిసిపోతోంది. గత టీడీపీ పాలనలో లక్షలాది రూపాయలు ఖర్చు చేపి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ప్రతి పంచాయ తీలోనూ నిర్మించారు. చేత్త సేకరణకు ప్రతి కేంద్రానికి ఇద్దరి నుంచి ఐదుగురి వరకు కార్మికుల (క్లాప్‌ మిత్ర లు)ను నియమించారు.

A useless wealth-making center

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో

తయారీ కేంద్రాలపై నిర్లక్ష్యం

రూ. లక్షల ఖర్చు వృథా

కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆశలు

శింగనమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గత ఐదేళ్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంపద సృష్టి ఏమో గాని ప్రజా ధనం చెత్తలో కలిసిపోతోంది. గత టీడీపీ పాలనలో లక్షలాది రూపాయలు ఖర్చు చేపి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ప్రతి పంచాయ తీలోనూ నిర్మించారు. చేత్త సేకరణకు ప్రతి కేంద్రానికి ఇద్దరి నుంచి ఐదుగురి వరకు కార్మికుల (క్లాప్‌ మిత్ర లు)ను నియమించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి, దాన్ని రీసైక్లింగ్‌ ద్వారా ఎరువుగా మార్చి తక్కువ ఽధరకు రైతులకు అందించాలి. ఇందు కు ఒక్కో కార్మికుడికి నెలకు రూ.ఆరు వేలు జీతం ఇచ్చేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించు కోకుండా గాలికి వదిలేయడంతో కొన్ని చోట్ల సంపద తయారీ కేంద్రాలు దిష్టి బొమ్మల్లా మారాయి. ఇం టింటి నుంచి చెత్త సేకరించడానికి ప్రభుత్వం అందిం చిన సైకిళ్లు తుప్పు పట్టిపోయాయి. జీతాలు సక్రమం గా రాకపోవడంతో క్లాప్‌ మిత్రలు చెత్త సేకరణకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలో కి వచ్చింది కావున గ్రామాలలో నిరుప యోగంగా ఉన్న చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను విని యోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


18 పంచాయతీల్లోనూ...నిరుపయోగంగానే...

శింగనమల మండలంలో 19 పంచాయతీలుండగా, నాగులగుడ్డం తండా మినహా 18 పంచాయతీల్లో 2014- 19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష చొప్పు న ఖర్చు చేసి చెత్వ నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించింది. క్లాప్‌ మిత్రలు గామాల్లో సేకరించిన చెత్త ను ఈ సంపద కేంద్రాల్లో తడి, పోడి చెత్తగా విభజిస్తా రు. వాటి ద్వారా ఎరువులు తయారు చేసి రైతులకు అమ్మి, వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధికి వా డాలన్నది ప్రభుత ఉద్దేశ్యం. అయితే తరువాత వైసీపీ పాలన రావడంతో గత ఐదేళ్లలో ఏనాడు సంపద కేంద్రాలపై దృష్టి సాఽరించలేదు. పంచాయతీల అభివృ ద్ధికి ఉపయోగంగా ఉన్న సంపద కేంద్రాలను నిరూప యోగంగా మార్చారు. మూడు చక్రాల సైకిళ్లు తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుత్తం వాడుకోవడానికి వీలులేకుం డా పోయాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన కేంద్రా లు నిరుపయోగంగా ఉన్నాయి.

Updated Date - Dec 30 , 2024 | 12:25 AM