DIRTY : మురుగునీటితో సహజీవనం
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:41 AM
ఓ అపార్ట్‌మెంట్ వారి నిర్వాకం వల్ల దాని చుట్టు పక్కల నివశించే వారు ఆర్నెల్లుగా మురు గునీటితో సహజీవనం చేస్తున్నారు. మండలంలోని పాపంపేట పంచాయతీ గణే్‌షనగర్‌లో ఈ పరిస్థితి కనిసిస్తుంది. అక్కడ ఓ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు డ్రైనేజీ కాలువపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ర్యాంప్ దెబ్బతిని కాలువలోకి కుదువబడిపోయింది. ఫలితంగా మురుగు నీరు ముందుకు సాగేందుకు వీ లు లేకుండా పోయింది.
దుర్వాసనతో స్థానికుల అవస్థలు
ఆర్నెల్లుగా ఇదే పరిస్థితి
అనంతపురం రూరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓ అపార్ట్‌మెంట్ వారి నిర్వాకం వల్ల దాని చుట్టు పక్కల నివశించే వారు ఆర్నెల్లుగా మురు గునీటితో సహజీవనం చేస్తున్నారు. మండలంలోని పాపంపేట పంచాయతీ గణే్‌షనగర్‌లో ఈ పరిస్థితి కనిసిస్తుంది. అక్కడ ఓ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు డ్రైనేజీ కాలువపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ర్యాంప్ దెబ్బతిని కాలువలోకి కుదువబడిపోయింది. ఫలితంగా మురుగు నీరు ముందుకు సాగేందుకు వీ లు లేకుండా పోయింది. దీంతో కాలువలోని మురుగు నీరంతా అపార్ట్‌మెంట్ పక్కనున్న ఖాళీ స్థలం చేరింది. నెలల తరబడి మురుగునీరు నిల్వ ఉండటంతో స్థాని కులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. దుర్వాసనతో అవస్థ లు పడుతున్నారు. ఇళ్లలో నుం చి బయటకు రావాలంటే ము క్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్నెల్లుగా ఇదే పరి స్థితి వారిది. సమస్యను స్థానికు లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెళ్లి పరిస్థితిని పరిశీలించా రు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ ని ర్వాహకులు కాలువలో పడి పోయిన బండలను, ఇతరత్రా వాటిని తొలగించి ర్యాంపు నిర్మి స్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అపార్ట్‌మెంట్ నిర్వాహకులు పనులు చేయించడంలో జాప్యం చేస్తుండటంతో స్థానికులు అవస్థలు పడుతు న్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి మురు గునీటి ఇబ్బందులను తొలగించాలని ఆ అపార్ట్ మెంట్ చుట్టుపక్కల నివశించే వారు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 24 , 2024 | 12:41 AM