ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CORRUPTION : అవినీతి వ్యవహారం..!

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:04 AM

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో కాసు లకు కక్కుర్తి పడుతున్న ఓ అధికారి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకూ వికలాంగుల సంక్షేమ శాఖ లబ్ధిదారులకు అందించే స్కూటీ లు, ట్రైసైకిళ్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు తదితర వాటిలో ఆ అధికారి కమీషన్ల ద్వారా కాసులు దండుకున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. ఈ విషయంలో ఆ శాఖ రాష్ట్ర అధికారులతో పాటు... జిల్లా ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తూ... సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఆయ న తన సొంత కారును బినామీ పేరుతో కార్యాలయానికి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

Office of the Welfare of Differently Talented

బినామీ పేరుతో కార్యాలయానికి సొంత కారు

నెలనెలా రూ. 35 వేలు డ్రా

వెలుగులోకి ఓ అధికారి నిర్వాకం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో కాసు లకు కక్కుర్తి పడుతున్న ఓ అధికారి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకూ వికలాంగుల సంక్షేమ శాఖ లబ్ధిదారులకు అందించే స్కూటీ లు, ట్రైసైకిళ్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు తదితర వాటిలో ఆ అధికారి కమీషన్ల ద్వారా కాసులు దండుకున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. ఈ విషయంలో ఆ శాఖ రాష్ట్ర అధికారులతో పాటు... జిల్లా ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తూ... సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఆయ న తన సొంత కారును బినామీ పేరుతో కార్యాలయానికి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దానిని ఐదా రేళ్లుగా ఓ వైపు శాఖ పనులకు... మరో వైపు సొంత పనులకు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ శాఖలోని దిగువస్థాయి అధికారిని తనకు అనుకూలంగా మార్చుకొని కారు బాడుగకు సంబంధించిన బిల్లులను డ్రా చేస్తున్నట్లు సమాచారం. నెలనెలా రూ. 35 వేలు బిల్లులు డ్రా చేస్తుండటం బయటికి పొక్కడంతో... పలువురు దివ్యాంగులు, సంఘాల నాయకులు ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చే శారు. ఈ విషయంపై రాష్ట్రసాయి అధికారులు విచారణకు ఆదేశించడంతో ఆ అధికారి గత మూడు నెలలుగా ఆ కారును కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా విచారణకు ఎవరొచ్చారో... ఏం విచారణ చేశారో ఇప్పటికీ బయటకు రాలేదు.


అవినీతి ఆరోపణలపై కలెక్టర్‌ సీరియస్‌..?

విభిన్న ప్రతిభావంతుల శాఖలో దివ్యాంగుల సంక్షే మ పథకాలను పక్కదారి పట్టించడం... కాసులు దండుకోవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వ రుస కథనాలకు స్పందించిన కలెక్టర్‌ ఆ శాఖ అధికారులపై సీరియస్‌ అయినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా అధికారులతో మాట్లాడి, అసలు ఏం జరుగుతోందని ఆరా తీసినట్లు సమాచారం. ఆ అధికారిపై విచారణకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులు సైతం ఆ అధికారిపై సీరియ్‌సగా ఉన్నట్లు తెలిసింది. ఆ అధికారిపై వస్తున్న అవినీతి, అక్రమాల అరోపణలపై వారు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 20 , 2024 | 12:05 AM