CPI : ఘనంగా సీపీఐ శత వసంతోత్సవాలు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:28 AM
మండలంలోని గ్రామాల్లో సీపీఐ శత వసంతోత్సవాలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమల దొడ్డి గ్రామంలో గురువారం పార్టీ రాప్తాడు నియోజకవ ర్గం కార్యదర్శి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి నరేష్, కక్కలపల్లి కాలనీలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.
అనంతపురం రూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో సీపీఐ శత వసంతోత్సవాలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమల దొడ్డి గ్రామంలో గురువారం పార్టీ రాప్తాడు నియోజకవ ర్గం కార్యదర్శి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి నరేష్, కక్కలపల్లి కాలనీలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. మన్నీలలో గిరిజన స మాఖ్య రాష్ట్ర నాయకులు రామాంజినేయులు, ఆకుతోట పల్లిలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, ఐజి నగర్‌లో మండల కార్యదర్శి రమేష్ పార్టీ జెండాలు ఆవి ష్కరించారు. ఈకార్యక్రమంలో నాయకులు పోతలయ్య, మన్నిల వెంకటరాముడు, అజయ్‌కుమార్, నాగేష్, శారద, ఓబులేసు, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
శింగనమల: మండలంలోని శింగనమల, తరిమెల, నిదనవాడ గ్రామాల్లో సీపీఐ శత వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. శింగనమలలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు చెన్నప్పయాదవ్, సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి కేకు కట్ చేశారు. తరి మెల, నిదనవాడలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు తరిమెల రామాంజినేయులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
బుక్కరాయసముద్రం: సీపీఐ నియోజక వర్గం కార్యదర్శి టి నారాయణస్వామి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న జెం డా స్థూపం వద్ద పార్లీ శత వసంతాల ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్క రించారు. సీపీఐ మండల కార్యదర్శి మర్రిస్వామి, నా యకులు చాకల హరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నార్పల: మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద సీపీఐ వసంతోత్సవాలను ఘనం గా ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ పార్టీ జెండాను ఆవిష్క రించారు. నాయకులు చాపల రామాంజి, నాగ రాజు, సుధాకర్, లలితమ్మ, నాయకులు నారాయణప్ప, పెద్దక్క, సూరి, తిరుపతమ్మ తదితరులుపాల్గొన్నారు.
రాప్తాడు: సీపీఐ శత వసంతాల ఉత్సవాలను గురువారం ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహిం చారు. రాప్తాడులోని సీపీఐ కాలనీలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీపీఐ నాయకులు చలపతి, రాము, మల్లప్ప, రామాంజినేయులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 27 , 2024 | 12:28 AM