ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOKULAM : గోకులంపై రైతుల ఆసక్తి

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:04 AM

పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది.

Gokulam Shed completed in Shinganamala

అధికారులకు అందుతున్న వందల కొద్ది దరఖాస్తులు

శింగనమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది. దీంతో నిధులు మంజూరు కాక రైతులు వెనక్కు తగ్గారు. తిరిగి కూటమి అధికా రంలోకి రాగానే ఉపాధి హమీ పథకం కింద నిధులు కేటాయించి పశుపోషణకు మేలే చేకూరుస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వేగంగా నిర్మాణాలు

శింగనమల మండలంలో 69 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. నెల రోజుల్లోగా అన్ని నిర్మాణాలను ప్రారంభించారు. ప్రస్తుతం 30 షెడ్లు పూర్తయ్యారు. మిగిలిని 39 షెడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుం డటంతో అధికారులు చొరవతీసుకుని లబ్ధిదారులతో త్వరితగతిన షెడ్లు పూర్తి చేయిస్తున్నారు.


సక్తి చూపుతున్న రైతులు

మండలంలో మెదటి దశలో కేవలం 69 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. అయితే వాటి నిర్మాణాలు పూర్తి కావడంతో, గోకులం షెడ్ల కోసం మండలంలో వంద సంఖ్యలో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో రెండో విడతగా 79 షెడ్లు కావాలని స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా మంజూరు కాలే దు. ఇదిలాఉండగా గోకులం షెడ్ల కోసం రైతుల చేసుకున్న దరఖాస్తులు అధికారు లకు వందల కొద్ది వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

31లోగా పూర్తి చేస్తాం- శ్రీదేవి, ఏపీఓ, శింగనమల

మండలంలో మంజూరైన 69 గోకులం షెడ్లలో ఇప్పటికే 30 పూర్తయ్యాయి. ఇంకా 39 వివిధ దశల్లో ఉన్నాయి వాటిని డిసెంబరు31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. షెడ్ల నిరానానికి నిధులు పూర్తిస్థాయిలో మంజూరవుతుండడంతో రైతులు మందుకు వస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 26 , 2024 | 12:04 AM