CPI : ఎగువ కాలవకు రూ. 500 కోట్లు ఇవ్వాలి
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:48 AM
ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతాంగానికి ఎంతో ఉపయోగపడే హెచ్చెల్సీ ఎగువ కాలవ ఆధునికీకరణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ డిమాండ్ చేశా రు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నేతల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్
అనంతపురం విద్య, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతాంగానికి ఎంతో ఉపయోగపడే హెచ్చెల్సీ ఎగువ కాలవ ఆధునికీకరణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ డిమాండ్ చేశా రు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నేతల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాటా ్లడుతూ.. ఎగువ కాలవ ఆధునికీకరణ వల్ల 30 టీఎంసీల నీళ్లు రావడంతో... అనం తపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తుంగభద్ర జలాలు పూర్తిగా పంపడానికి సాధ్యపడుతుందన్నారు. చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు అందుతాయన్నారు. రూ.36 కోట్లు ఏమాత్రం సరిపోవని, ఆధునికీకరణ చేయడానికి రూ. 500 కోట్లు మంజూరుచేయాలని కోరారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్ట ణాల్లో 2 సెంట్లు ఇవ్వడంతోపాటు రూ. 5 లక్షలు మంజూరుచేయాలన్నారు. ప్రస్తు తం పెంచిన విద్యుత చార్జీలను వెంటనే తగ్గించాలని కోరారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ విద్యుత చార్జీలు తగ్గించాలంటూ... సచివాలయాలు, ఎ మ్మార్వో, కలెక్టర్ కార్యాలయాల వద్ద సీపీఐ, వ్యవసాయ, కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ స్వామి, మల్లికారర్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి, రాజేష్ గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 22 , 2024 | 12:49 AM