CBI: అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్‌ఎం అరెస్ట్...
ABN, Publish Date - Jul 06 , 2024 | 01:27 PM
Andhrapradesh: అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్‌ను రైల్వే అధికారులులంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు రోజులు పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు.
అనంతపురం, జూలై 6: అవినీతి కేసులో గుంతకల్లు (Guntakal) డీఆర్ఎం వినీత్ సింగ్‌ను సీబీఐ అధికారులు (CBI) అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్‌ను రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. అనంతరం గుంతకల్లు డీఆర్ఎం వినీత్‌తో పాటు, కుందా ప్రదీప్ బాబు, అక్కిరెడ్డి, బాలాజీ, లక్ష్మీపతి రాజులను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..
గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనుల్లో రైల్వే అధికారులు కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్‌లతో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం అరెస్టు అయిన రైల్వే అధికారులను సికింద్రాబాద్ తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Ramesh Naidu: జగన్, కేసీఆర్ ఒకరింటికి ఒకరెళ్లి చేపల పులుసు తిన్నారే తప్ప...
GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్పొరేటర్లు
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 06 , 2024 | 01:59 PM