AP ELECTIONS : నిర్ణేత అతడే!
ABN, Publish Date - May 19 , 2024 | 11:21 PM
ఇటీవల ముగిసిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. అయినా మహిళా ఓటర్ల కన్నా పురుషులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 9,97,792 మంది ఉండగా, మహిళా ఓటర్లు 10,20,124మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 8,37,451మంది, మహిళా ఓటర్లు 8,18,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో రాయదుర్గం, ...
ఓటింగ్‌లో పురుషులదే పైచేయి
మహిళా ఓటర్లు అధికం... ఓటింగ్ మాత్రం తక్కువ
అధికార వైసీపీలో ఆందోళన
అనంతపురం టౌన : ఇటీవల ముగిసిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. అయినా మహిళా ఓటర్ల కన్నా పురుషులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 9,97,792 మంది ఉండగా, మహిళా ఓటర్లు 10,20,124మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 8,37,451మంది, మహిళా ఓటర్లు 8,18,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈఎనిమిది నియోజక
వర్గాలలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే 22,333 మంది అధికంగా ఉన్నారు. కానీ ఓటింగ్‌లో మాత్రం పురుషులు మహిళల కన్నా 18,455మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వైసీపీలో గుబులు
రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను మహిళలలే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారు సీఎం జగనకే మద్దతు ఇచ్చి ఉంటారని, అందుకే తామే మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు బీరాలు పలుకుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా అనంత జిల్లాలో మహిళా ఓటర్ల కన్నా పురుషులే ఎక్కువుగా ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. అదికూడా ప్రతి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా అన్ని నియోజకవర్గాలలోను పురుషులే ఎక్కువగా ఓటు వేయడానికి రావడం, మహిళలు ఓటుకు దూరంగా ఉండటం ఫ్యాన పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, భూఆక్రమణలు, ఇసుక, మద్యం అక్రమ రవాణతో పాటు మద్యం ధరలు విపరీతంగా పెంచడం, రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కించడం, ఉద్యోగాల కల్పన
లేకపోవడం వంటి వాటి గురించి పురుష ఓటర్లలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈనేపథ్యమే పురుషుల ఓటింగ్ ఎక్కువగా నమోదవడానికి కారణమవుతోంది. ఈ అంశమే వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. కళ్యాణదుర్గంలో 24.59శాతం, ఉరవకొండలో 2.53శాతం, శింగన మలలో 2.48శాతం, రాయదుర్గంలో 1.76శాతం, గుంత కల్లులో 2.08 శా తం, రాప్తాడులో 1.53శాతం, అనంత పురం అర్బనలో 0.63శాతం, తాడిపత్రి లో 0.53శాతం మంది పురుష ఓటర్లు మహిళల కంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 19 , 2024 | 11:21 PM