ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: ఏపీని వీడని వర్షాలు.. రాప్తాడులో వర్ష బీభత్సం

ABN, Publish Date - Oct 22 , 2024 | 10:54 AM

Andhrapradesh: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Heavy Rains in Raptadu constituency

అనంతపురం, అక్టోబర్ 22: ఏపీని (Andhrapradesh) వర్షాలు వీడటం లేదు. ఇటీవల విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

విధ్వంసాన్ని తట్టుకుని.. సగర్వంగా తలెత్తి


రోడ్లన్నీ బ్లాక్..

గత రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వరద నీటితో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పంట నష్టంపై అధికారులతో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సునీత ఆరాతీస్తున్నారు. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ఈ క్రమంలో వర్ష బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సునీత పర్యటిస్తున్నారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఉప్పరపల్లి సమీపంలో వరదలో మునిగిన ప్రాంతాలను అధికారులతో కలసి పరిటాల శ్రీరామ్ పరిశీలిస్తున్నారు.


బాధితుల ఆవేదన..

అటు రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పోలేపల్లి - అక్కంపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సునీత.. తీవ్ర వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నారు. వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లిందంటూ బాధితులు బోరున విలపించారు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చిత్రావతి నది పొంగి పొర్లతుండడంతో రాయలవారి పల్లి, కోవేలగుట్ట పల్లి వంతెనలపై భారీగా వర్షపు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు.

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..



తెగిన చెరువు కట్ట...

రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో గత రాత్రి భారీగా వర్షం కురిసింది. ఈ క్రమంలో కనగానపల్లి మండల కేంద్రంలో వర్షపు నీటి ధాటికి చెరువు కట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పలు గ్రామాలలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అలాగే పంటపొలాలు నీటమునిగాయి. వాగులు ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి...

TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే

Srisailam: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఎప్పటినుంచంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 10:59 AM