High Court Judge : శ్రమ ఆయుధమైతే గెలుపు బానిసవుతుంది
ABN, Publish Date - Sep 29 , 2024 | 12:23 AM
‘శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుంది’ అని హైకోర్టు జడ్జి, అనంతపురం పోర్టు పోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం ఈ-కోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ శ్యాంసుందర్, జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్, విశ్రాంత న్యాయాధికారి హజరతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోను, న్యాయమూర్తిగానూ రాణించాలంటే ...
హైకోర్టు జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి
అనంతపురం క్రైం, సెప్టెంబరు 28: ‘శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుంది’ అని హైకోర్టు జడ్జి, అనంతపురం పోర్టు పోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం ఈ-కోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ శ్యాంసుందర్, జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్, విశ్రాంత న్యాయాధికారి హజరతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోను, న్యాయమూర్తిగానూ రాణించాలంటే పట్టుదలగా కృషి చేయాలని సూచించారు. అదృష్టం కంటే హార్డ్‌వర్క్‌ను నమ్ముకోవాలని, అది ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని అన్నారు. తన విద్యాభ్యాసాన్ని హిందూపురం, అనంతపురం, కర్నూలులో కొనసాగించాననని, అనంతపురాన్ని జన్మభూమిగా భావిస్తానని అన్నారు. అనంతరం బార్
అసోసియేషన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుప్రసాద్, రాజేంద్రప్రసాద్ న్యాయవాదుల సమస్యలను హైకోర్టు న్యాయమూర్తులకు వివరించారు. పోక్సో కోర్టు దూరంగా ఉండటం వలన కక్షిదారులు, న్యాయాధికారులు, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని, జిల్లా కోర్టుకు సమీపంలో స్థలాన్ని కేటాయించాలని కోరా రు. స్థలం, నిధుల కేటాయింపునకు సహకారం అందిస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. ఆరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నిర్మాణానికి రావాల్సిన నిధుల విషయంలోనూ సహకరిస్తామని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు న్యాయాధికారులతో హైకోర్టు న్యాయమూర్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కోర్ట్స్ విధులలో భాగంగా పలు సూచనలు చేశారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎస్పీ జగదీష్ మర్యాద పూర్వకంగా కలిశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 29 , 2024 | 12:23 AM