ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CRIME : కూతురు వద్దనుకుంటే తల్లి లేకుండా పోయింది..!

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:09 AM

జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...

Madhavi died

జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది. కడుపులో ఉన్న నాలుగు నెలల పిండాన్ని చిదిమేశారు. అధిక రక్తస్రావం కావడంతో తల్లి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. గుంతకల్లు పట్టణంలోని కథల వీధిలో ఓ ఏఎనఎం ఇంట్లో అబార్షన వికటించి.. మాధవి(28) అనే మహిళ శుక్రవారం మృతి చెందారు.

ఇదీ జరిగింది..

వజ్రకరూరుకు చెందిన మాధవికి విడపనకల్లు మండలం చీకలగుర్కికి చెందిన వెంకటేష్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు నంద్యాల జిల్లా డోనలో మాధవికి స్కానింగ్‌ చేయించారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని అక్కడ చెప్పారు.


దీంతో వారు కూతురు వద్దనుకున్నారు. రెండు రోజుల క్రితం మాధవి, ఆమె భర్త వెంకటేష్‌.. ఇద్దరి కుటుంబ సభ్యులు కలసి గుంతకల్లు పట్టణంలోని కథల వీధిలో ఉన్న ఓ ఏఎనఎంను కలిశారు. ఏఎనఎం తల్లి శుక్రవారం ఉదయం అబార్షన చేసింది. మధ్యాహ్నానికి మాధవికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక మాధవి మృతిచెందారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చీకలగుర్కికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది టూటౌన పోలీసులకు సమాచారం అందించారు.

- గుంతకల్లు టౌన

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 01:09 AM

Advertising
Advertising