BK : మడకశిరను ఉద్యాన హబ్‌గా మారుస్తాం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:41 AM
మడకశిర నియోజకవర్గంలోని వనరులను వినియోగించి ఉద్యాన హబ్‌గా మారుస్తామని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి అన్నారు. ఆ బాధ్యత తనదన్నారు. ఆయన శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇనచార్జ్ గుండుమల తిప్పేస్వామితో కలిసి రొళ్ల, అమరాపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీకే మాట్లాడుతూ... నియోజకవర్గానికి కృష్ణా జలాలను తెచ్చి ఇక్కడి అన్ని చెరువులను నింపుతామన్నారు. హార్టికల్చర్ కింద అభివృద్ధి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. నూతన టెక్నాలజీతో వక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఆ బాధ్యత నాది..:
ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి
పుట్టపర్తి/రొళ్ల, ఏప్రిల్27 (ఆంధ్రజ్యోతి): మడకశిర నియోజకవర్గంలోని వనరులను వినియోగించి ఉద్యాన హబ్‌గా మారుస్తామని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి అన్నారు. ఆ బాధ్యత తనదన్నారు. ఆయన శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇనచార్జ్ గుండుమల తిప్పేస్వామితో కలిసి రొళ్ల, అమరాపురం మండలాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
బీకే మాట్లాడుతూ... నియోజకవర్గానికి కృష్ణా జలాలను తెచ్చి ఇక్కడి అన్ని చెరువులను నింపుతామన్నారు. హార్టికల్చర్ కింద అభివృద్ధి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. నూతన టెక్నాలజీతో వక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీగా పోటీచేస్తున్న తనకు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుకు ఓటు వేయాలన్నారు. కల్లురొప్పం గొల్లహట్టి గ్రామంలో ఈరన్న, దొడ్డీరప్ప, బండీరప్ప, ఈరన్న తరఫున 40 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి.
జగనకు తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎస్..
బీకే పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ... పింఛన్ల విషయంలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జవహర్‌రెడ్డి.. సీఎం జగనకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంటి వద్దే పింఛన ఇచ్చే విషయంలో ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారివారి ఇళ్లవద్దకే పింఛన అందించే కార్యక్రమం చేపడుతుందన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....