Collecor : మంత్రి లోకేశ వస్తారు.. జాగ్రత్త
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:19 AM
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ పాఠశాలలు తనిఖీకి వస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో మధ్యాహ్న భోజన పథకంపై మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేశ అన్ని...
విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
అనంతపురం టౌన, సెప్టెంబరు 3: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ పాఠశాలలు తనిఖీకి వస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో మధ్యాహ్న భోజన పథకంపై మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేశ అన్ని జిల్లాలలో పాఠశాలలను తనిఖీ చేస్తున్నారని, బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. తాను జిల్లాలో చాలా పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి
భోజనం చేశానని అన్నారు. ఆకు కూరలు తక్కువగా వాడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని సూచించారు. చాలామంది విద్యార్థులు పులిహోర, వెజ్ పలావ్‌ను ఇష్టపడటం లేదని అన్నారు. ఉడికించిన కోడిగుడ్లను కూడా రోజూ తినడానికి పిల్లలు ఇష్టపడటం లేదని అన్నారు. బదులుగా ఆమ్లెట్స్, కోడిగుడ్ల కూర ఇవ్వాలని సూచించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందేలా చూడాలని ఆదేశించారు. సమీఓలో డీఈఓ వరలక్ష్మి, ఏపీసీ నాగరాజు, ఎంఈఓలు, మోడల్, రెసిడెన్సియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
కోర్టు కేసులపై నిర్లక్ష్యం వద్దు
కోర్టు కేసులు విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని వివిధ శాఖల అధికారులకు కలెక్టరు సూచించారు. కంటెంప్ట్ కేసులు కోర్టులో నమోదైన వెంటనే పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమీక్షలో డీఆర్వో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 04 , 2024 | 12:19 AM