Bhuvaneshwari: విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Feb 14 , 2024 | 12:25 PM
Andhrapradesh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి నిర్వహించారు.
అనంతపురం, ఫిబ్రవరి 14: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటామంతి నిర్వహించారు. తమ స్కూల్‌కు రావాలన్న విద్యార్థుల ఆహ్వానం మేరకు భువనేశ్వరిని అక్కడకు చేరుకుని... స్కూల్‌లో ఉన్న సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆపై విద్యార్థులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని విద్యార్థులను భువనమ్మ కోరారు. టెక్నాలజీని వాడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని, టెక్నాలజీని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. విద్యార్థి దశ నుండే సంస్కృతి, సాంప్రదాయలను అలవాటు చేసుకోవాలని తెలిపారు. గురువులు దేవుళ్ళతో సమానమని, వారిని గౌరవించాలని విద్యార్థులకు వివరించారు. భువనేశ్వరికి హరీష్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గాయత్రి శ్లోకాన్ని పాడి వినిపించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 14 , 2024 | 12:25 PM