EDUCATION : సంకల్పం ఫెయిల్
ABN, Publish Date - Apr 24 , 2024 | 11:49 PM
అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు...
స్టడీ మెటీరియల్ ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం
పది ఫలితాల్లో జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లు బోల్తా
అత్యల్ప ఫలితాలకు బాధ్యత ఎవరిది?
అనంతపురం విద్య, ఏప్రిల్ 24: అధికారులు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం అనంత సంకల్పం మెటీరియల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, జిల్లా పరిషత స్కూళ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఇతర యాజమాన్య స్కూళ్ల కంటే అత్యల్ప ఫలితాలు జడ్పీ, ప్రభుత్వ స్కూళ్లలో వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు డీసీఈబీ ద్వారా మెటీరియల్ తయారు చేయించే ఇస్తుంది. అయితే గతంలో 100 రోజుల యాక్షన ప్లానతో రెడీ చేసి ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది తీవ్ర నిర్లక్ష్యం చూపి సగానికిపైగా రోజులు గడిచాక ఇచ్చారు.
కింద నుంచి ఒకటి, రెండు స్థానాలు
ఇతర యాజమాన్య స్కూళ్లలో పోలిస్తే ఈ ఏడాది గవర్నమెంట్ స్కూళ్లు, జిల్లాపరిషత స్కూళ్ల ఫలితాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. టెన్త ఫలితాల్లో గవర్నమెంట్ స్కూళ్లు, జడ్పీ స్కూళ్లు కింద నుంచి ఒకటి, రెండో స్థానాల్లో నిలిచాయి. గవర్నమెంట్ స్కూళ్లలో బాయ్స్ 1051 మందికి గాను 651 మంది పాసయ్యారు. బాలికలు884 మందికిగాను 629 మంది పాసయ్యారు. మొత్తంగా 1935 మందికిగా 1280 మంది పాసయ్యారు. 66.15 శాతం ఉత్తీర్ణత వచ్చింది. జడ్పీ స్కూళ్లు బాలురు 6,108 మంది రాస్తే... 3,715 మంది, బాలికలు 5345 మంది రాస్తే...4085 మంది పాసయ్యారు. టోటల్‌గా 11453 మంది పరీక్షలు రాస్తే 7800 మంది పాసయ్యారు. 68.10 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇతర యాజమాన్య స్కూళ్లలో 70 శాతంపై నుంచి 80 శాతం, 90 శాతం పైనే వచ్చాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి దారుణమైన ఫలితాలు వచ్చాయనే విమర్శలు వినవస్తున్నాయి.
వారి నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
ప్రతి ఏటా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే డీసీఈబీ ద్వారా గవర్నమెంట్, జడ్పీ విద్యార్థులకు అనంత సంకల్పం పేరుతో స్టడీ మెటీరియల్ అందిస్తారు. నిపుణులైన ఉపాధ్యాయులతో మెటీరి యల్ తయారు చేయిస్తారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజుల ద్వారా...
ఆ మెటీరియల్‌ను బయట ముద్రణాలయాల్లో రూపొంది స్తారు. అయితే ఈ విద్యా ఏడాది ఈ ప్రక్రియపై అప్పటి డీఈఓ, డీసీఈబీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారు. ఫలితంగా సకాలంలో మెటీరియల్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. పరీక్షలకు కేవలం 49రోజుల ముందు అప్పటి కలెక్టర్‌తో ఆవిష్కరణ చేయించి, ఇద్దామా వద్దా అన్నట్లుగా పిల్లలకు పంపిణీ చేశారు. అంతేకాకుండా మెటీరియల్ ప్రిపరేషనపై హెచఎంలతో ఎలాంటి పర్యవేక్షణ చేయించలేదు. ఈ కారణాలన్నింటి వల్ల కూడా ఫలితాలు దారుణంగా వచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ల ఆలోచనలను నీరుగారుస్తున్నారా...?
మునుపటి జిల్లా కలెక్టర్ల ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ఈ అనంత సంకల్పాన్ని కొందరు అధికారులు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారి నిర్లక్ష్యం ఇప్పుడు వేలాది విద్యార్థులకు శాపంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్లలో బాలురు 400 మంది, బాలికలు 255 మంది ఫెయిల్ అయ్యారు. జడ్పీ స్కూళ్లలో బాలురు 2393 మంది,
బాలికలు 1260 మంది టెన్త పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. రెండు యాజమాన్య స్కూళ్లలో ఏకంగా 4308 మంది ఫెయిల్ అయ్యారు. అధికారులు ముందుగా శ్రద్ధ పెట్టి ఉంటే...వీళ్లలో సగం మంది కానీ, అందరూ కానీ పాసయ్యే అవకాశాలు ఉండేవేమో. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇక్కడ నష్టపోయింది మాత్రం పేద విద్యార్థులే. విద్యార్థుల భవిష్యత్తుకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఏ అధికారి పూడుస్తారో చూడాలి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 24 , 2024 | 11:49 PM