ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ramanaidu: వైసీపీ ప్రభుత్వంలో సీమ జిల్లాలకు అన్యాయం.. మంత్రి రామానాయుడు విసుర్లు

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:15 PM

సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించానని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లలో నీటుపారుదల శాఖకు కేవలం రూ.49 కోట్లు బడ్జెట్ కేటాయించారని అన్నారు.

అనంతపురం: సీఎం చంద్రబాబు ఆదేశాలతో హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించానని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లలో నీటుపారుదల శాఖకు కేవలం రూ.49 కోట్లు బడ్జెట్ కేటాయించారని అన్నారు. అందులో ఖర్చు చేసింది కేవలం రూ.31 కోట్లు మొత్తం రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేవలం 2.2 శాతం ఇచ్చారని చెప్పారు. రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతానికి ఏ సీఎం చేయన్నత ద్రోహం జగన్ చేశారని మండిపడ్డారు.


హంద్రీనీవాకు టీడీపీలో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తే జగన్ హయాంలో కనీసం రూ. 200 కోట్లు ఖర్చు చేయలేదని అన్నారు. నీటిపారుదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. రాయలసీమలో హంద్రీనీవా కాల్వ సామర్థ్యం 3850 క్యూసెక్కులు అని చెప్పారు. గత పాలకుల తీరుతో 1800 క్యూసెక్యులు రావడం లేదని తెలిపారు. ఐదేళ్లు మొద్దు నిద్రలో వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు.


వచ్చే ఏడాది సీజన్‌కి 3850 క్యూసెక్యుల నీరు పారేలా మెయిన్ కెనాల్ విస్తరణకు ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. తుంగభద్ర19వ గేటు కొట్టుకుపోతే... వెంటనే సీఎం చొరవతో స్టాప్ లాక్ గేట్ పెట్టామని అన్నారు. సీమ జిల్లాలకు అన్యాయం జరగకుండా పని చేశామని తెలిపారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ... ప్రాజెక్టులు నింపుకుంటూ వస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయిలో నిండాయన్నారు. గత ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడంతో నీరు నిల్వ చేయలేక పోయారని చెప్పారు. పోలవరానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర కు నీరు తరలించే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - Sep 22 , 2024 | 10:19 PM