CM JAGAN : చంద్రబాబుపై విమర్శలతో సరి
ABN, Publish Date - May 10 , 2024 | 12:24 AM
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన రోడ్ షో యావత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మేమంతా సిద్ధం పేరిట కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, 114 చెరువులకు నీరు వంటి గత ఎన్నికల హామీలను విస్మరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో వాటి ప్రస్థావనే తేలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ‘మీ బిడ్డ మంచి చేసి ఉంటే చేతులెత్తండి’ అని పదే పదే వైసీపీ ...
హామీలపై నోరెత్తని సీఎం జగన
ఎప్పటిలాగే రోడ్ షోతో జనానికి కష్టాలు
కళ్యాణదుర్గం/రూరల్, మే 9: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన రోడ్ షో యావత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మేమంతా సిద్ధం పేరిట కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం ఆయన పర్యటించారు. భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, 114 చెరువులకు నీరు వంటి గత ఎన్నికల హామీలను విస్మరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో వాటి ప్రస్థావనే తేలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ‘మీ బిడ్డ మంచి చేసి ఉంటే చేతులెత్తండి’ అని పదే పదే వైసీపీ
కార్యకర్తలతో చేతులు ఎత్తించారు. ఆ తరువాత పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యను పరిచయం చేసి సభను ముగించేశారు. జగన సభకు జనాలను సమకూర్చేందుకు వైసీపీ నాయకులు ముప్పతిప్పలు పడ్డారు. రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ పట్టణాల నుంచి జనాలను సమీకరించారు. జన సమీకరణ కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.40 వేల ప్రకారం మొత్తం 200 పోలింగ్ కేంద్రాలకు రూ.80 లక్షల వరకు డబ్బును వెదజల్లినట్లు సమాచారం. దారి పొడవునా మద్యం, బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
జనానికి నరకం
సీఎం రాక నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతి వంద మీటర్లుకు ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలు, ప్రయాణికులను రోడ్డు మీదికి రాకుండా అడ్డుకున్నారు. అనంతపురం, ధర్మవరం, హిందూపురం నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులు, ఆటోలను పట్టణ శివారలోనే నిలిపేశారు. ప్రజలు అక్కడి నుంచి కాలినడకన పట్టణంలోకి చేరుకున్నారు. బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు. బస్సులు ఇక్కడికి రావని, పట్టణ శివారులోకి వెళ్లి ఎక్కాలని అక్కడున్న సిబ్బంది చెప్పి పంపించారు. జగన ఎక్కడికి వెళ్లినా ఇదే పద్ధతి కనిపిస్తోందని, సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనాడు విలేకరిపై దాడి
జగన రోడ్ షోను చిత్రీకరిస్తున్న ఈనాడు విలేకరి రమే్‌షపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. సెల్‌ఫోన లాక్కుని పిడిగుద్దులు కురిపించారు. అక్కడున్న మిగిలిన విలేకరులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విలేకరిపై దాడిని టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఖండించారు. ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 10 , 2024 | 12:24 AM