ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP : మోహనరాగం. నిధులు మాయం!

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:39 AM

ఆయన వైసీపీకి మండల కన్వీనరు. పైగా ఎంపీపీ భర్త. అధికారం ఉండటంలో అప్పట్లో చక్రం తిప్పాడు. కానీ చిత్రంగా.. ప్రభుత్వం మారినా ఆయన హవా కొనసాగుతోంది. పోలీసులు, మండల పరిషత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు, డెప్యుటేషనలు, ఉన్నచోటే కొనసాగడం.. ఇలా.. ఏదైనా సరే.. ఆయన ప్రమేయం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పంచాయతీ బిల్లులు పెట్టాలంటే ...

Panchayat sanitation tractor at Mohan's house

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుడి హవా..

మోఎమ్మెల్యే గుమ్మనూరు పేరు వాడుకుని దందాలు

బదిలీలు, డెప్యుటేషనలు, బిల్లులు.. ఆయన కనుసన్నల్లోనే..

పంచాయతీ ట్రాక్టర్‌ను సొంతానికి వాడుతున్న ఘనుడు

సంపూర్ణ సహకారం అందిస్తున్న కొందరు అధికారులు

గుంతకల్లు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆయన వైసీపీకి మండల కన్వీనరు. పైగా ఎంపీపీ భర్త. అధికారం ఉండటంలో అప్పట్లో చక్రం తిప్పాడు. కానీ చిత్రంగా.. ప్రభుత్వం మారినా ఆయన హవా కొనసాగుతోంది. పోలీసులు, మండల పరిషత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు, డెప్యుటేషనలు, ఉన్నచోటే కొనసాగడం.. ఇలా.. ఏదైనా సరే.. ఆయన ప్రమేయం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పంచాయతీ బిల్లులు పెట్టాలంటే ఆయను ఆశ్రయించాల్సిందే. మండల ఇంజనీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరు, హార్టికల్చర్‌ అధికారులు, మండల అభివృద్ధి అధికారి సైతం ఆయనకు


దాసోహమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. పనిచేయకుండానే రూ.లక్షల్లో బిల్లులు డ్రాచేసిన ఘనుడు ఆయన. పంచాయతీ శానిటేషన ట్రాక్టరును ఇంటి పనులకు వాడుతున్నాడు. బదిలీ అయిన అధికారులను ఇక్కడికే డెప్యుటేషనపై తేవడం, పాత తేదీలతో వారిచేత ఎం-బుక్‌ చేయించి బిల్లులు కాజేయడంలో సిద్ధహస్తుడు. ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ మండల పరిషతలో చక్రం తిప్పుతున్నాడు. పేరు మోహన రావు..! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా.. వైసీపీ నాయకుడి పెత్తనం ఏమిటని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

నిధుల స్వాహా

వైసీపీ హయాంలో మండల గ్రాంట్లను స్వాహా చేశాడు. వివిధ పంచాయతీల్లో శానిటేషన, గ్రావెల్‌ రోడ్‌ ఫార్మేషన, రోడ్లపై ఎర్రమన్ను చల్లడం, వాటర్‌ సప్లై, బోర్‌వెల్‌ స్పేర్స్‌ కొనుగోలు, గొట్టపు బావుల తవ్వకం.. పలు రకాల పనులను చేయకుండానే.. వాటి పేరుతో 15వ ఆర్థిక సంఘ నిధులను కాజేశాడు. తన పేరిటే కాదు, తల్లి శంకరమ్మ, సోదరుడు సురేంద్ర పేరిట నెలగొడ, వెంకటాంపల్లి, గుర్రబ్బాడు, నాగసముద్రం, వైటీ చెరువు, చింతలాంపల్లి తదితర గ్రామాల్లో పనులు చేసినట్లు బిల్లులు పెట్టి రూ.52 లక్షల పీఎ్‌ఫఎంఎస్‌ నిధులు, రూ.15.84 లక్షల సీఎ్‌ఫఎంఎస్‌ నిధులను పక్కదారి పట్టించాడు. నీరు పడని బోర్లకు కేసింగ్‌, మోటారును ఏర్పాటు చేయకపోయినా, రూ.లక్ష వరకూ బిల్లులు డ్రా చేశాడు. వైసీపీ హయాంలో పాతకొత్తచెరువు పంచాయతీ పారిశుధ్య పనికి కేటాయించిన ట్రాక్టరును తన స్వగ్రామం నెలగొండకు తీసుకెళ్లి వ్యవసాయ పనులకు వినియోగించుకుంటున్నాడంటే.. వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

బదిలీల్లో మోహనరాగం

పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఎంపీడీఓ, రెవెన్యూ కార్యాలయాల సిబ్బంది, అధికారుల బదిలీల్లో ఇప్పటికీ ఆయనదే హవా..! ఓ సీఐ, ఎస్‌ఐని గుంతకల్లుకు రప్పించాడని, ఓ రెవెన్యూ అధికారి బదిలీ జరక్కుండా అడ్డుకుంటున్నాడని ప్రచారం ఉంది. గుంతకల్లు మండల ఇంజనీరు ఓబులేసు లాంగ్‌ స్టాండింగ్‌లో గుత్తికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుత్తి నుంచి గుంతకల్లుకు బదిలీపై వచ్చిన మల్లేష్‌ నాయక్‌ను మళ్లీ డెప్యుటేషనపై గుత్తికి పంపారు. ఓబులేసును గుంతకల్లుకు డెప్యుటేషనపై తెచ్చారు. ఇందులోనూ ఆయన ప్రమేయమే ఉందని సమాచారం. మండలంలో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేసేందుకు ఈ డెప్యుటేషన వ్యవహారం జరుగుతోందనేది బహిరంగ రహస్యం. గుంతకల్లులో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇనచార్జి ఇంజనీరుగా పనిచేసిన దత్తు.. వైసీపీ హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వర్కు వ్యాల్యూపై 2 శాతం ఇస్తే చాలు.. పాత తేదీలతో ఆయన ఎంబుక్‌ రికార్డు చేసేస్తారని ఆరోపణలున్నాయి. ఆయన పేరిట చేసిన ఎం-బుక్‌లకు బిల్లులను చెల్లించడం లేదని ఎంపీడీఓ శ్రీకాంత చౌదరి ధ్రువీకరించారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన మోహనరావు.. తనకు ఎమ్మెల్యే జయరాం మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు. అన్ని శాఖల్లో చక్రం తిప్పుతున్నాడు. దీంతో టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఉంటూనే.. అవసరానికి ఎమ్మెల్యే ఆఫీసుచుట్టూ చక్కర్లు కొట్టడం ఆయనకు పరిపాటి. వైసీపీ హయాంలో టీడీపీ సర్పంచులున్న పంచాయతీలకు బిల్లులు, సర్పంచు గౌరవ వేతనం కూడా రాకుండా చేశారు. టీడీపీ కూటమి పాలనలో వైసీపీ ప్రజాప్రతినిధులకూ బిల్లులు పాస్‌ చేయిస్తున్నాడు.

దత్తు ఎం-బుక్‌లను నిలువరించాం..

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇనచార్జి జేఈగా పనిచేసిన దత్తు చేసిన బిల్లులు ఫేక్‌ అని తెలిసి, అతడు చేసిన రికార్డును అనుమతించడం లేదని ఎంపీడీఓ శ్రీకాంత చౌదరి తెలిపారు. వైసీపీ నాయకుడు మోహన అవినీతి వ్యవహారాలపై పొంతనలేని సమాధానాలిచ్చారు. మండల ఇంజనీరును, ఈఓఆర్డీని అడగండంటూ చేతులు దులిపేసుకున్నారు. పంచాయతీ ట్రాక్టరును సొంతానికి వాడుతున్న విషయంలో వివరణ కోరడానికి ఈఓఆర్డీ నాగభూషణంకు పలుమార్లు ఫోన చేసినా లిఫ్ట్‌ చేయలేదు. వైసీపీ నాయకుడి వ్యవహా రంలో అన్ని వేళ్లూ ఎంపీడీఓ వైపే చూపుతున్నాయి. ఎమ్మెల్యే దృష్టిలో లేని పనుల బిల్లులను ఎంపీడీఓ సహకారంతోనే వైసీపీ నాయకుడు డ్రాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో మండలంలోని ఏ పంచాయతీకీ చేతి పంపు విడి భాగాలను ఇవ్వలేదు. కానీ వాటిని కొన్నట్లు రూ.2.80 లక్షల బిల్లులు పెట్టారు.

ఎంపీపీ అవినీతి, అక్రమాలపై నాలుగు నెలల కిందట కొందరు డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌కు ఆధారాలతో ఫిర్యాదులు పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఓ డీఎల్‌డీఓ, ఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలోతూతూమంత్రంగా విచారణ జరిపారు. నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. గడిచిన మూడేళ్లలో మండలంలో జరిగిన పనులపై గ్రామ సభలు నిర్వహిస్తే.. బండారం బయట పడుతుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 12:39 AM