TDP CAMPAIN: ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష: జేసీ పవనరెడ్డి
ABN , Publish Date - May 12 , 2024 | 12:12 AM
ప్రజల ఆశీస్సులే మా కుటుంబానికి శ్రీరామరక్ష అని, మీ ఆశీర్వాదాలతోనే మా కుటుంబానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, మీ రుణం తీర్చుకోలేనిదని టీడీపీనేత జేసీ పవనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో శనివారం ఆయన విస్తృతంగా బహిరంగసభలు నిర్వహించారు.
తాడిపత్రిటౌన, మే 11: ప్రజల ఆశీస్సులే మా కుటుంబానికి శ్రీరామరక్ష అని, మీ ఆశీర్వాదాలతోనే మా కుటుంబానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, మీ రుణం తీర్చుకోలేనిదని టీడీపీనేత జేసీ పవనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో శనివారం ఆయన విస్తృతంగా బహిరంగసభలు నిర్వహించారు. పట్టణంలోని చిన్నబజారు, ఏటిగడ్డపాలెం, సుంకులమ్మపాలెం, తూర్పుపాలెం, అంబేడ్కర్ సర్కిల్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి, నా తమ్ముడు జేసీ అశ్మితరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గత ఐదేళ్లలో తాడిపత్రిలో అభివృద్ధి పడకేసిందన్నారు. వందలాది పరిశ్రమల మూసివేతతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామన్నారు. విదేశాల్లో మంచి యూనివర్శిటీల్లో చదువుకున్న జేసీ అశ్మితరెడ్డి కావాలో, చదువురాని వ్యక్తి కావాలో ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుందన్నారు. 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కూడా మరోసారి కూటమి ఎంపీ, ఎ మ్మెల్యే అభ్యర్థులైన అంబికా లక్ష్మినారాయణ, జేసీ అశ్మితరెడ్డిలకు అండగా నిలవాలని ప్రజలను ఆ యన అభ్యర్థించారు. బహిరంగసభల్లో మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కుమారుడు విరాజ్‌రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, బీజేపీ నాయకులు రంగనాథ్‌రెడ్డి, గంగాధర్‌యాదవ్, కౌన్సిలర్ విజ్జి, లక్ష్మినారాయణ, బింగి ప్రభాకర్, కమలమ్మ, రోషన్న, వరదయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
టీడీపీ అభ్యర్థిని గెలిపించండి: సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పులిచెర్ల లావణ్య ప్రజలను కోరారు. శనివారం మండలంలోని కోమలి, తాతగారిపల్లి గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.