ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TESTS : కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:23 AM

నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో సోమవా రం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్పీ జగదీష్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీస్‌ నియామక ప్రక్రియలో భాగం గా కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అ ర్హత సాధించిన జిల్లాలోని అభ్యర్థులకు దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించారు.

The staff conducting physical fitness tests, examining SP

పర్యవేక్షించిన ఎస్పీ జగదీష్‌

అనంతపురం క్రైం,డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో సోమవా రం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్పీ జగదీష్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీస్‌ నియామక ప్రక్రియలో భాగం గా కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అ ర్హత సాధించిన జిల్లాలోని అభ్యర్థులకు దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించారు. సోమవా రం నుంచి జనవరి 17వరకు జరిగే ఈ ప్రక్రియకు పురుష అభ్యర్థులు 5242, మహిళా అభ్యర్థులు 1237 మందితో కలిపి మొత్తం 6479మంది హాజరు కానున్నా రు. సోమవారం మొదటగా అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ పరిశీలించాక బయోమెట్రిక్స్‌ తీసుకున్నారు. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ తీసుకున్నారు. పరీక్షలలో భాగం గా 1600మీటర్లు, 100మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ పరీక్షలు నిర్వహించారు. పొర పాట్లకు తావులేకుండా ఆధునిక ఆర్‌ఎఫ్‌ఐడీ కంప్యూటరైజ్డ్‌ టెక్నాలజీతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం : ఎస్పీ

ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మిమోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉద్యో గం ఇప్పిస్తామని ఎవరైనా మోసపు మాటలు చెప్పినా డయల్‌-100 లేదా సమీప పోలీసులకు తెలియజే యాలన్నారు. ఏదైనా సమస్యలపై అప్పీల్‌ చేసు కునే వారు ప్రస్తుతం రాసి ఇచ్చి జనవరి 17న అప్పీలుకు రావాలని సూచించారు. దేహడారుఢ్య పరీక్షలకు అభ్యర్తులు వెరిఫికేషన కోసం ఒరిజిన ల్‌ ఽధ్రువపత్రాలతో రావాలన్నారు. అద నపు ఎస్పీలు రమణమూర్తి, ఇలియాజ్‌బాషా, డీ ఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మీడియాకు ఆంక్షలు

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే సమయంలో మీడియాకు ఆంక్ష లు విధించారు. లోపలికి వెళ్లండి...కానీ ఫొటోలు, వీడియాలు తీసుకోవద్దంటూ ఆల్టిమేటం జారీ చేశారు. వారిచ్చిన ఫొటోలనే వాడుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా తొలి రోజు మొత్తం ఎంతమందికి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారనే విషయంలోనూ స్పష్టత ఇవ్వ లేకపోయారు. దాదాపు 300మందికి పరీక్ష లు నిర్వహించినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా ఆంక్షలు విధించడంపై విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోడ్డు నుంచి పీటీసీకి వెళ్ళే రోడ్డు, బ్రిడ్జి నుంచి సర్వీస్‌రోడ్డు, లక్ష్మీనగర్‌కు వెళ్లే రహదారులను బారికేడ్లు వేసి మూసివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక బయటి నుంచి చూస్తున్న వారిని సైతం అక్కడి నుంచి పోలీసులు పంపివేయడం గమనార్హం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 31 , 2024 | 12:23 AM