AP News: అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు
ABN, Publish Date - May 01 , 2024 | 08:28 AM
అనంతపురం: జిల్లాలో పోలీస్ మార్క్ రాజకీయాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం: జిల్లాలో పోలీస్ మార్క్ రాజకీయాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (YCP) వీడి తెలుగుదేశం (TDP)లో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ (Police Target) చేశారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు (Jayaram Naidu)ను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జయరాం నాయుడు కుటుంబ సభ్యులను వన్ టౌన్ సిఐ రెడ్డప్ప బెదిరింపులకు గురి చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggupati Venkateswara Prasad) వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్రమంగా కేసు బనాయించి అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడంపై మండిపడ్డారు.జయరాం నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్
ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 01 , 2024 | 08:33 AM