ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PATHoLE : రోడ్డుపై గొయ్యి

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:14 AM

మండల పరిధిలోని కల్లుమడి-గుమ్మేపల్లి రోడ్డుపై కల్లుమడి సమీపంలో పైపు పగిలిపోవడం తో పెద్ద రంధ్రం పడింది. ఎంపీఆర్‌ దక్షిణ కాలువకు అను బంధంగా ఉన్న ఐదు కాలువ నుంచి పొలాలకు నీరు వెళ్లేందుకు ఈ సిమెంట్‌ పైప్‌ లైన ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా వెళుతున్న ఈ పైపు దాదాపు ఏడాది క్రితం పగిలిపోయి రోడ్డులో పెద్ద రంధ్రం ఏర్పడింది.

A big pothole on Kallumadi-Gumempalli road

ఆదమరిస్తే అంతే సంగతులు

పట్టించుకోని అధికారులు

శింగనమల, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కల్లుమడి-గుమ్మేపల్లి రోడ్డుపై కల్లుమడి సమీపంలో పైపు పగిలిపోవడం తో పెద్ద రంధ్రం పడింది. ఎంపీఆర్‌ దక్షిణ కాలువకు అను బంధంగా ఉన్న ఐదు కాలువ నుంచి పొలాలకు నీరు వెళ్లేందుకు ఈ సిమెంట్‌ పైప్‌ లైన ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా వెళుతున్న ఈ పైపు దాదాపు ఏడాది క్రితం పగిలిపోయి రోడ్డులో పెద్ద రంధ్రం ఏర్పడింది. అధి కారులు చొరవ చూపి పూడ్చిన సందర్భం ఇప్పటి వరకు లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా ప్రమా దం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధం గా ఈ రంధ్రం వద్ద ఏమరుపాటుగా ప్రయాణించ డంతో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పలువురు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రోడ్డు మధ్యలో ఉన్న రంధ్రా న్ని పూడ్చాలని ఎన్ని మార్లు అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు, ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డు పక్కనే పొలాలు ఉన్న రైతులుకొద్ది రోజులు రంధ్రానికి రాళ్లు అడిపెట్టారు. కొన్ని రో జులుగా ముళ్ల కంపను అడ్డుపెట్టారు. ఇవన్నీ తాత్కాలికమని, ఇప్పటికైనా అధికారులు స్పం దించి రంధ్రాన్ని పూడ్చి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 31 , 2024 | 12:14 AM