DEVOTIONAL : ముగిసిన సన్నాహక కార్యక్రమం
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:17 AM
హనుమాన చాలీసా ప్రచార సమితి, పవన యువజన సేవా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన భారీ ఎత్తున హనుమాన చాలీసా పార్యాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని లలితకళా పరిషతలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమం గురు వారం ఘనంగా ముగిసింది.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : హనుమాన చాలీసా ప్రచార సమితి, పవన యువజన సేవా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన భారీ ఎత్తున హనుమాన చాలీసా పార్యాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని లలితకళా పరిషతలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమం గురు వారం ఘనంగా ముగిసింది. రెండోరోజు కార్యక్రమంలో నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 56 పాఠశాలల విద్యార్థులు పాల్గొని సామూహికంగా హనుమాన చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ప్రమోద్‌స్వామి, శ్రీపాద వేణు, సుంకు వేణుగోపాల్, ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శబరి వరప్ర సాద్, ఆకుల రాఘవేంద్ర, గల్లా హర్ష, హర్షద్ జైన, విశ్రాంత రిజిస్ర్టార్ ఆచా ర్య సుధాకర్‌బాబు, హనుమాన చాలీసా ప్రచార సమితి సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 20 , 2024 | 12:17 AM