REPAIRS: దెబ్బతిన్న బీటీ రోడ్డుకు మరమ్మతులు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:08 AM
మండలంలోని అనంతపురం- కందుకూరు రోడ్డంటే గతంలో అందరూ హడిలిపోయేవారు. 2022లో బీటీ రోడ్డు నిర్మించారు. అయితే వేసిన ఏడాదికే రోడ్డు దెబ్బతింది. ఇరువైపులా గుంతలు పడ్డాయి. దీంతో వాహన దారులు రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఏ గుంతల్లో పడిపోతామో అనే భయాందోళనకు గురయ్యేవారు.
ప్రజలు, ప్రయాణికుల హర్షం
అనంతపురంరూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని అనంతపురం- కందుకూరు రోడ్డంటే గతంలో అందరూ హడిలిపోయేవారు. 2022లో బీటీ రోడ్డు నిర్మించారు. అయితే వేసిన ఏడాదికే రోడ్డు దెబ్బతింది. ఇరువైపులా గుంతలు పడ్డాయి. దీంతో వాహన దారులు రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఏ గుంతల్లో పడిపోతామో అనే భయాందోళనకు గురయ్యేవారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చాయంటే అంతేసంగతి అన్న విధంగా ఉండేది. వాహనాన్ని పక్కకు దింపే పరిస్థితి ఉండేదీ కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి వాహనదారులకు విముక్తి లభించింది. గుంతలు పడ్డ రోడ్డులో ప్యాచ వర్కులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ క్రమంలో దెబ్బతిన్న రోడ్డుకు వారం రోజుల కిందట మరమ్మతులు చేశారు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల అవస్థల ప్రయాణా నికి మోక్షం లభించినట్లు అయిందంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 26 , 2024 | 12:09 AM