ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ZP MEETING : రైతులను ఆదుకోండి..!

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:58 PM

తుఫాను, అధిక వర్షాల కారణంగా పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని, రైతులను ఆదుకోవాలని జిల్లా పరిషత సభ్యులు డిమాండ్‌ చేశారు. వేరుశనగ, పత్తి, కొర్ర, మిర్చి తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వారికి పరిహారం ఇవ్వాలని మంత్రిని, జిల్లా కలెక్టర్‌ను కోరారు. మెజార్టీ చెరువులకు నీరు ఇవ్వాలని కోరారు. ఫించన్ల రద్దు అంశంపై వైసీపీ జడ్పీటీసీలు, మడకశిర ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. అనర్హుల పింఛన్లను రద్దు చేస్తారని, కూటమి ప్రభుత్వం కొత్తగా 15 లక్షల పై చిలుకు కొత్త ఫించన్లు ఇస్తోందని మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. జిల్లా పరిషత సర్వసభ్య ...

Collector Vinod Kumar speaking in the meeting

వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి

చెరువులకు హంద్రీనీవా నీరు ఇవ్వండి

ప్రభుత్వానికి జిల్లా పరిషత సభ్యుల వినతి

పింఛన్ల తొలగింపుపై వైసీపీ సభ్యులతో వాగ్వాదం

కొత్తగా 15 లక్షల పింఛన్లు ఇస్తామన్న మంత్రి సత్యకుమార్‌

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌, అధికారుల గైర్హాజరుపై అసంతృప్తి

అనంతపురం విద్య, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):

తుఫాను, అధిక వర్షాల కారణంగా పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని, రైతులను ఆదుకోవాలని జిల్లా పరిషత సభ్యులు డిమాండ్‌ చేశారు. వేరుశనగ, పత్తి, కొర్ర, మిర్చి తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వారికి పరిహారం ఇవ్వాలని మంత్రిని, జిల్లా కలెక్టర్‌ను కోరారు. మెజార్టీ చెరువులకు నీరు ఇవ్వాలని కోరారు. ఫించన్ల రద్దు అంశంపై వైసీపీ జడ్పీటీసీలు, మడకశిర ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. అనర్హుల పింఛన్లను రద్దు చేస్తారని, కూటమి ప్రభుత్వం కొత్తగా 15 లక్షల పై చిలుకు కొత్త ఫించన్లు ఇస్తోందని మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. జిల్లా పరిషత సర్వసభ్య


సమావేశంలో ప్రధానంగా ఈ రెండు అంశాలపై రెండున్నర గంటలపాటు చర్చ సాగింది. చైర్‌పర్సన గిరిజమ్మ అధ్యక్షతన 11వ సర్వసభ్య సమావేశం జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. సుమారు గంటన్నర ఆలస్యంగా సభ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా, మెజార్టీ ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌, జేసీ, వివిధ శాఖల అధికారులలో సగం మంది సభకు రాలేదు. వారిపై చైర్‌ పర్సన, మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారులందరూ వచ్చే సమావేశానికి హాజరయ్యేలా చూస్తామని సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.

అన్నదాతలకు ఆసరా..

ఉమ్మడి జిల్లా రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారని జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాల వల్ల పొలాల్లో పంటలకు మొలకలు వస్తున్నాయని అమడగూరు, గుమ్మఘట్ట, విడపనకల్లు జడ్పీటీసీలు అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. పరిగి చెరువుకు మరమ్మతులు చేయించాలని ఆ మండల జడ్పీటీసీ కోరారు. కంది విత్తనాలను మోతాదును పెంచాలని యల్లనూరు జడ్పీటీసీ కోరారు. అడవి పందులు, ఇతర జంతువుల నుంచి పంటలకు రక్షణ కల్పించాలని లేపాక్షి జడ్పీటీసీ కోరారు. ఎరువుల కోసం డబ్బులు చెల్లించినా తమ మండలంలో సరఫరా చేయలేదని కంబదూరు జడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించని అధికారులపై కఠిన చర్యలు జేడీఏని ఆదేశించారు. ఏవో, ఏడీ వెంటనే కంబదూరు మండలంలో పర్యటించి, పరిస్థితిని తనకు తెలియజేయాలని కోరారు. యల్లనూరులో పప్పుశనగ దిగుబడులను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడంలేదని, మూడేళ్లుగాను తాను సభ దృష్టికి తెస్తున్నా న్యాయం జరగలేదని జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మార్కెడ్‌ ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతపురం బైపాస్‌ నుంచి టమోటా మండీలకు వెళ్లే రహదారిలో ట్రాఫిక్‌ సమస్య ఉందని, కక్కలపల్లికి వెళ్లాలంటే గంట పడుతోందని అనంతపురం రూరల్‌ జడ్పీటీసీ సభ దృట్టికి తీసుకొచ్చారు. డబుల్‌ రోడ్డు పనులు వెంటనే జరిగేలా చూడాలని కోరారు. సర్వే నంబర్‌ 83లో సమాధులను తవ్వేని కొట్టాలు వేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సిద్దరాంపురం చెరువుకు నీరు ఇవ్వాలని జడ్పీ వైస్‌ చైర్మన నాగరత్న అధికారులను కోరారు.

- అనంతపురం నగరంలోని నడిమివంక, మరువ వంకలో పూడిక తియ్యనందుకే ఏడాదిన్నర క్రితం వరదలు వచ్చాయని, ప్రస్తుతం అన్ని వంకల్లో పూడిక తీస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. వంకలకు రక్షణ గోడలను నిర్మించడంపై దృష్టిసారిస్తామని అన్నారు. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధంపై గ్రామస్థాయి నుంచి కసరత్తు చేయాలని అన్నారు. దీనిపై జడ్పీ పాలకవర్గం తీర్మానం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మండలాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని కొందరు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. జడ్పీ చైర్‌ పర్సన కూడా ఇదే అంశంపై పెదవి విరిచారు. ప్రొటోకాల్‌ పాటించేలా సర్కులర్‌ జారీ చేస్తామని జడ్పీ సీఈఓ అన్నారు.

చెరువులకు నీరివ్వండి..

- హంద్రీనీవా ద్వారా తమ ప్రాంతంలోని చెరువులకు నీరు ఇవ్వాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కోరారు. 2014-2019 మధ్య చెరువులకు నీరు ఇచ్చారని, ఆ తర్వాత రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలలో చెరువులకు నీరు ఇవ్వాలని, చెరువులకు మరమ్మతులు చేయించాలని కోరారు.

- మడకశిర నియోజకవర్గం సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉందని, తమ ప్రాంత చెరువులకు గత ఐదేళ్లలో చుక్కనీరు ఇవ్వలేదని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. తాగునీటి సమస్య కూడా ఉందని, వెంటనే నీరు ఇవ్వాలని అధికారులను కోరారు.

అధికారులు ఎక్కడ..?

- శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌, జేసీ, ఇతర ఉన్నతాధికారుల గైర్హాజరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీలు సమస్యలపై ప్రశిస్తే సమాధానం చెప్పడానికి కలెక్టర్‌, ఉన్నతాధికారులు లేకుంటే ఎలా అని మడకశిర ఎమ్మెల్యే అన్నారు. తాము సభలో ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదని అన్నారు. ఎమ్మెల్యేలు వచ్చినా జిల్లా అధికారులు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశమా..? లేక ఒక జిల్లా సమావేశమా..? అని మండిపడ్డారు. అధికారుల తీరుపై చైర్‌ పర్సన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జిల్లా కలెక్టర్‌తో తాను మాట్లాడుతానని, వచ్చే సమావేశానికి వారం ముందు తన దృష్టికి తీసుకురావాలని జడ్పీ సీఈఓకు అనంత కలెక్టర్‌ సూచించారు. అధికారులు అందరూ హాజరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

- పీహెచసీల్లో వైద్యుల కొరతను మెజార్టీ జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. బ్రహ్మసముద్రం పీహెచసీలో నాడు-నేడు పనులపై విచారణ చేయాలని జడ్పీటీసీ కోరారు. నార్పల పీహెచసీని గైనకాలజిస్టును ఇవ్వాలని జడ్పీటీసీ కోరారు. కొత్త చెరువుకు పీహెచసీ అవసరం ఉందని, మంజూరు చేయాలని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర కోరారు. శెట్టూరు, లేపాక్షి జడ్పీటీసీలు పీహెచసీ సమస్యలను సభదృష్టికి తీసుకొచ్చారు.

పింఛన్లపై రగడ

కంబదూరు, గుమ్మఘట్ట, యల్లనూరు, అనంతపురం రూరల్‌, కనగానపల్లి జడ్పీటీసీలు, కొందరు ఎంపీపీలు పింఛన్ల రద్దు గురించి ప్రశ్నించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు కలుగజేసుకుని, అనర్హులవి మాత్రమే తొలగిస్తారని అన్నారు. మూడు నెలలలో 5908 వృద్ధాప్య పింఛన్లు, 519 దివ్యాంగుల పింఛన్లను తొలగించారని చైర్‌పర్సన గిరిజమ్మ అన్నారు. ఈ క్రమంలో వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనర్హుల పింఛన్లను తొలగించి, తమ ప్రభుత్వం కొత్తగా 15 లక్షల పింఛన్లు ఇవ్వనుందని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన పింఛన రద్దు కాదని, రద్దుకు సహేతుక కారణాలను డీఆర్‌డీఏ, పింఛన పంపిణీ అధికారులు (పీడీఓ) లబ్ధిదారులకు వివరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సత్యకుమార్‌

సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై మంత్రి సత్యకుమార్‌ స్పందించారు. చెరువులకు నీటి విడుదలపై నీటిపారుదశాల శాఖ అధికారులు క్షేత్రస్థాయి స్పష్టత ఇవ్వాలని సూచించారు. పీఎంజీఎ్‌సవై 3.0 ప్రస్తుతం నడుస్తోందని అన్నారు. గ్రామీణ రహదారులకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు గ్రామీణ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్‌ కనెక్టివిటీ లేకుండా ఒక్క గ్రామం కూడా ఉండకూడదని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌, అధికారులు గైర్హాజరుపై తాను కూడా విచారిస్తానని, వచ్చే సమావేశానికి హాజరుకావాలని ఆదేశిస్తామని అన్నారు. గత ప్రభుత్వం సర్పంచులకు చెక్‌ పవర్‌ లేకుండా చేసిందని, ఈ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషిస్తోందని అన్నారు. గ్రామాలకు రూ.4500 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. పింఛన్లపై తనకూ ఫిర్యాదులు వచ్చాయని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు అందుతాయని అన్నారు. కొత్తగా 15 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. పీహెచసీ సమస్యలపై రీ సర్వే చేయిస్తామని అన్నారు. జనాభా, ఇతర పరిస్థితులను బట్టి పీహెచసీల మంజూరు, డాక్టర్లు కొరత, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, శ్రీసత్యసాయి జిల్లా డీఆర్వో, ఉమ్మడి జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 11:58 PM