TDP: ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు: టీడీపీ నేత
ABN, Publish Date - May 31 , 2024 | 01:13 PM
శ్రీ సత్య సాయి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్న వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొందని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలు (Comments) సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి (NDA Kutami) అధికారంలోకి వస్తున్న వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొందని కదిరి (Kadiri) టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి (TDP MLA Candidate) కందికుంట వెంకటప్రసాద్ (Kandikunta Venkata Prasad) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కదిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, వైసీపీ (YCP) నిబంధనలు పాటించని పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు మారుపేరు అని అన్నారు. చట్టబద్ధంగా వెళ్దామని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించినా.. సయంమనం పాటించాలని సూచించారు. ఎన్నికల్లో గెలవబోతున్నామని, ప్రభుత్వంలో భాగస్వాములం కాబోతున్నామని, విజయాన్ని ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, వినియోగించుకునే విధంగా ఆలోచన చేద్దామని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీ లోని u/s 153,505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
పోల్ మేనేజ్ మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్ మెంట్ కూడా చేయగలిగితేనే ఎన్నికల్లో తమకు గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ ఏజెంట్లకు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ మేనేజ్‌మెంట్ క్లాస్ తీసుకున్నారు. రూల్స్ అంటూ మడి కట్టుకుని కూర్చొని ఏ ఒక్క ఓటునూ వదిలేయొద్దని.. వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు పని చేయాలన్నారు. అవసరమైతే రూల్స్ దాటి అయినా పనిచేయాలని సూచించారు. రూల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలని సూచించారు. ప్రతీ కౌంటింగ్ ఏజెంట్‌కు ఈ విషయాలన్నీ క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలని ఛీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 31 , 2024 | 01:24 PM