PROTEST : పదోరోజుకు చేరిన కార్మికుల నిరసన
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:24 AM
మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ సప్లై ప్లాంటు వద్ద సత్యసాయికార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివా రం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.... తమకు గౌరవ వేతనం ఆర్నెల్ల నుంచి అందించకపోవడంతో కుటుం బాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మట్టిని తింటూ నిరసన తెలిపారు.
కొత్తచెరువు, ఆగస్టు 31: మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ సప్లై ప్లాంటు వద్ద సత్యసాయికార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివా రం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.... తమకు గౌరవ వేతనం ఆర్నెల్ల నుంచి అందించకపోవడంతో కుటుం బాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మట్టిని తింటూ నిరసన తెలిపారు.
తాము 10 రోజుల నుంచి నిరసన తెలుపు తున్నా స్థానిక ప్రజాప్రతినిదులు, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపో వడం బాధాకరమన్నారు. లక్షలాదిమందికి దాహార్తిని తీరుస్తున్నామని, ఇప్పటికైన ప్రజాప్రతినిదులు స్పందించి తాగునీటి ప్రాజెక్టుకు బకాయిలను వెంటనే విడుదల చేయించి ఆదుకోవాలని వారు కోరారు.
ముదిగుబ్బ: మండల కేంద్రంలోని సత్యసాయి తాగునీటి పంపు హౌస్ వద్ద శనివారం సత్యసాయి కార్మికులు పదోరోజు సమ్మె కొనసా గించారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 01 , 2024 | 12:24 AM