ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM JAGAN : నీళ్లు పారలేదు.. కళాశాలలూ రాలేదు

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:52 AM

మండలాల్లో పాదయాత్ర చేయడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. పాదయాత్ర సందర్భంగా యాడికి, పెద్దవడుగూరు మండలాలకు జగన ఎన్నో ఆశలు కల్పించారు. ముఖ్యంగా యాడికి కాలువకు నీళ్లు వచ్చేలా చేస్తామని ఇచ్చిన హామీ ట్రయల్‌రనకే పరిమితమైంది. అదే విధంగా యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా అవీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు మండలాల ప్రజలు జగన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -

Jagana speaking at a public meeting (File)

నెరవేరని యాడికి, పెద్దవడుగూరు ప్రజల ఆకాంక్ష...

ఉత్తుత్తి హామీలేనంటూ జగనపై జనం ఆగ్రహం

ప్రతిపక్షనేతగా జగనరెడ్డి తమ

మండలాల్లో పాదయాత్ర చేయడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. పాదయాత్ర సందర్భంగా యాడికి, పెద్దవడుగూరు మండలాలకు జగన ఎన్నో ఆశలు కల్పించారు. ముఖ్యంగా యాడికి కాలువకు నీళ్లు వచ్చేలా చేస్తామని ఇచ్చిన హామీ ట్రయల్‌రనకే పరిమితమైంది. అదే విధంగా యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా అవీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు మండలాల ప్రజలు జగన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -తాడిపత్రి


తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో వైఎస్‌ జగనరెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఆయా మండలాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 డిసెంబరు 5న పెద్దవడుగూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఎన్నో హామీలు గుప్పించారు. ఉద్యోగులకు పాతపెన్షన విధానాన్ని పునరుద్ధరిస్తానని, యాడికి కాలువకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. యాడికి కాలువకు అరకొర నీరు మాత్రమే సరఫరా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజయానికి ఈ రెండు మండలాలు కీలకంగా నిలిచాయి. ఈ రెండు మండలాల్లోనే పాదయాత్ర చేయడంతో ఇవి ఎంతో అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనరెడ్డి పాదయాత్ర సమయంలో యాడికి కాలువకు నీళ్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.


అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలవుతున్నా నామమాత్రంగానే నీరు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. కాలువ నీటితో రైతులు ఒక్క పంట కూడా పండించిన దాఖలాలు లేవు. యాడికిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పెద్దవడుగూరు మండలంలోనూ జానియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామంటూ పలు పర్యాయాలు ప్రజాప్రతినిధులు హంగామా చేశారేగానీ ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

నీటి విడుదల ఏదీ..?

పాదయాత్ర సమయంలో జగనరెడ్డి యాడికి కాలువకు పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పదవీ కాలం పూర్తయ్యేసరికిగానీ యాడికి కాలువకు నీరు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. కంటితుడుపు చర్యగా ట్రయల్‌రన మాదిరిగా నీరు వదిలారు తప్ప యాడికి కాలువ కింద రైతులకు ఒక్కపంటకు కూడా పండించిన దాఖలాలు లేవు. ఉత్తుత్తి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు.

- జగదీష్‌, రైతు, ఎన.కొత్తపల్లి, యాడికి మండలం


జూనియర్‌ కళాశాల హామీ ఉత్తిదే

పాదయాత్ర సమయంలో జగనరెడ్డి యాడికిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేకపోవడంతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు దినసరి కూలీలుగా, కార్మికులుగా మారుతున్నారు. ఐదేళ్లు గడిచినా జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయలేదంటే యాడికి వాసులను మోసం చేసినట్లే.

- నరసింహులు, పిన్నేపల్లి, యాడికి మండలం

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 12:52 AM

Advertising
Advertising