OFFICER : తీరు మారలేదు..!
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:43 AM
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు మారలేదు, కమీషన్లలో తగ్గేదేలా అన్న తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆ శాఖ వర్గాల నుంచే అభిప్రా యాలు వెలువుడుతున్నాయి. పత్రికల్లో వరుస కథనా లు వస్తున్నా, ఆ శాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారులు చివాట్లు పెట్టినా, కలెక్టర్ అవినీతిపై ఆరా తీస్తున్నా ఆయనలో ఇసుమంతైనా భయం కనిపించ కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో ఓ అధికారి వ్యవహారంపై విమర్శలు
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి ): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలో ఓ అధికారి తీరు మారలేదు, కమీషన్లలో తగ్గేదేలా అన్న తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆ శాఖ వర్గాల నుంచే అభిప్రా యాలు వెలువుడుతున్నాయి. పత్రికల్లో వరుస కథనా లు వస్తున్నా, ఆ శాఖ రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారులు చివాట్లు పెట్టినా, కలెక్టర్ అవినీతిపై ఆరా తీస్తున్నా ఆయనలో ఇసుమంతైనా భయం కనిపించ కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా గా.. ఎన్నికల సమయంలో వీల్‌చైర్ల పంపిణీలో ఆ యన కమీషన్లకు కక్కుర్తి పడిన విషయం విదితమే. వీల్‌చైర్ల పంపిణీలో టెండర్లు దక్కించుకున్న ఓ ముగ్గురు వ్యక్తులకు మిగిలిన మొత్తం ఇవ్వాల్సి ఉం ది. అయితే మూడ్రోజుల క్రితం ఆ అధికారి వారిని కార్యాలయానికి పిలిపించి ఆ మిగులు చెక్కులను పంపిణీ చేసినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఆ సమయంలోనూ తన వాటా తనకి వ్వాలని వారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో వారు ఆ అధికారి వాటా కింద దాదాపు రూ. 3 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఆ అధికారి మెడకు అవినీతి ఉచ్చు బిగుస్తున్పప్పటికీ... మామూళ్ల విష యంలో ఏ మాత్రం తగ్గేదేలా అన్న రీతిలో కమీషన్లకు పాల్పడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని రాష్ట్రస్థాయిలో ఉన్న కొందరు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
తప్పించుకునే ప్రయత్నం
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖలోని ఆ అధికారి తీరుపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలపై ఆ శాఖ రాష్గ్రస్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టరేట్ వర్గాలు సైతం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత వారంలోనూ కలెక్టరేట్ అధికారులు ఫోన ద్వారా ఆ అధికారిపై వస్తున్న ఆరోపణలపై ఆరా తీయగా, తాను సెలవులో ఉన్నానని బుకాయించి గ్రీవెన్స కార్యక్రమా నికి కూడా డుమ్మా కొట్టినట్లు సమాచారం. అయితే ఆ రోజంతా కార్యాలయంలోనే ఉండి తన ఆర్థికపరమైన అంశాలపై పలువురితో లావాదేవీలు జరిపినట్లు ఆ శా ఖలోని కొందరు ఉద్యోగుల ద్వారా అందిన సమాచా రం. తాజాగా... మరోమారు కలెక్టరేట్ వర్గాలు అవినీతి కథనాలపై ఆరా తీయగా, పొంత నలేని సమాదానాలు చెప్పడంతో పాటు తనకు ఆరోగ్యం బాగోలేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 25 , 2024 | 12:43 AM