DSP VEERA RAGHAVA REDDY : ‘వీర’ విధేయుడి బదిలీ
ABN, Publish Date - May 06 , 2024 | 12:36 AM
వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్‌షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు ...
టీడీపీ, సీపీఐ నేతల ఫిర్యాదు
డీఎస్పీపై చర్యలు తీసుకున్న ఈసీ
అనంతపురం క్రైం, మే 5: వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్‌షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంనాయుడు, ఆయన
భార్య హరిత తదితరులను కేసులో చేర్చారు. ఓటర్లను భయపెట్టి, ప్రలోభాలకు పాల్పడేందుకు వైసీపీ వారు ఈ ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై టీడీపీ, సీపీఐ నాయకులు ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచనలు, ఆదేశాల మేరకే డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం స్పందించిన ఎన్నికల కమిషన.. డీఎస్పీపై వేటు వేసింది.
మొదటి నుంచి అంతే..
డీఎస్పీ వీరరాఘవరెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఎమ్మెల్యే అనంతకు ఆయన అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 అక్టోబరులో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి-ఒకే రాజధాని నినాదంతో టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనను నీరు గార్చేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలతో పాటు ఏబీఎన-ఆంధ్రజ్యోతి ప్రతినిధులపట్ల దురుసుగా ప్రవర్తించారు. 2021లో జరిగిన
నగరపాలిక ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్షంగా పనిచేశారు. టీడీపీ నాయకులకు లేనిపోని భయాలు సృష్టించారు. కేసులు పెడతామని, అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించారు. ఎమ్మెల్యే అనంత ఎవరిపై కేసు పెట్టమంటే వారిపై కేసు పెట్టడం, బైండోవర్ చేయుంచడం వంటివి జరిగిపోయాయి. ఎస్‌ఎ్‌సబీఎనను ప్రైవేటుపరం చేయకూడదని విద్యార్థులు ఆందోళన చేసిన సందర్భంలోనూ ఆయన తీవ్ర వివాదంలో ఇరుక్కున్నారు. డిగ్రీ విద్యార్థిపై జరిగిన దాడిని సైతం వైసీపీకి అనుకూలంగా మార్చారు. జగనను విమర్శించారనే నెపంతో అనంతపురంలో తెలుగు మహిళల ఇళ్లలో సోదాలు చేశారు. పడక గదుల్లో సైతం తనిఖీలు చేశారు. మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మరింత వివాదాస్పదమైంది. అప్పటి ఎస్పీ ఫక్కీరప్పతో డీఎస్పీకి విభేదాలుండేవి. అప్పట్లో మూడేళ్ల పాటు పనిచేసిన వీరరాఘవరెడ్డి, వైసీపీ కోసమే పనిచేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 2022లో ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికే అనంతపురం విజిలెన్స డీఎస్పీగా వచ్చారు. ఆరు నెలలకే మార్కాపురం బదిలీ అయ్యారు. అక్కడ ఏడాది పాటు పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురం డీఎస్పీగా వచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 06 , 2024 | 12:36 AM