Share News

KESHAV ROAD SHOW: వంద రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తాం: కేశవ్‌

ABN , Publish Date - May 11 , 2024 | 12:11 AM

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీ, పార్క్‌ ఆంజనేయస్వామి గుడి, కామన్నకట్ట, జైనబ్బీ దర్గా కూడలిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

KESHAV ROAD SHOW: వంద రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తాం: కేశవ్‌
రోడ్‌షోలో మాట్లాడుతున్న పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 10: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ హామీ ఇచ్చారు. పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీ, పార్క్‌ ఆంజనేయస్వామి గుడి, కామన్నకట్ట, జైనబ్బీ దర్గా కూడలిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోకు మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ఉరవకొండలో నీటి సమస్యకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కారణమన్నారు. కనీసం తాగునీటి ప్రాజెక్టులపై అవగాహన కూడా లేదన్నారు. ఇలాంటి అసమర్థులకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పని చేసే వారికి పట్టం కట్టాలని సూచించారు. అర్హులై ఉండి పట్టాలు రాని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని, మార్పు కోరుకుంటున్నారన్నారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణంలోని జామియా మసీదు, మదీన మసీదు, పాత సంత మార్కెట్‌లోని మసీదుల్లో శుక్రవారం కేశవ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు వేల్పుల శ్రీనివాసులు, బీరే శేఖర్‌, సుదర్శన, బాలచంద్ర, వార్డు సభ్యులు నిరంజనగౌడ్‌, వాసు, రహంతుల్లా, ఈడిగ, వేణు, నూర్‌, యూనిస్‌ పాల్గొన్నారు.


టీడీపీలోకి 10 కుటుంబాల చేరిక

విడపనకల్లు: మండల కేంద్రానికి చెందిన 10 కుటుంబాలు శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ సమక్షంలో వైసీపీ పార్టిని వీడి టీడీపీలో చేరారు. వైసీపీకి సీనియర్‌ నాయకుడు రియాజ్‌ పార్టీ విధానాలు నచ్చక కుటుంబ సభ్యులతో పాటు టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. మహమ్మద్‌, ఖాదర్‌బాషా, వడ్డే వెంకటేశులు, ఆచారి, సుమో అంజి, బసన్న, వారి కుటుంబ సభ్యులు టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో పాపారాయుడు, మోహన, ప్రకాష్‌, పాల్గొన్నారు.

బెళుగుప్ప: మండలంలోని ఎర్రగుడిలో టీడీపీ మహిళలు శుక్రవారం ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీ నారాయణను గెలిపించాలని కోరారు. దబ్బర సుశీలమ్మ, స్రవంతి, పుష్పవతి, సింధు, యశోదమ్మ పాల్గొన్నారు.


టీడీపీలోకి చేరిక: మండలంలోని బూదివర్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తిమ్మన్న, తిమ్మరాజులు శుక్రవారం టీడీపీలోకి చేరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్థానిక పార్టీ కార్యాలయంలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వెంకటాద్రిపల్లికి చెందిన వైసీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తలారి పెద్ద రాజు, హనుమంతరాయుడు, సోమశేఖర తదితరులు ఉన్నారు.

Updated Date - May 11 , 2024 | 12:11 AM