ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP Leader Arrest: కదిరిలో వైసీపీ నేత అరెస్టు

ABN, Publish Date - Nov 04 , 2024 | 10:51 AM

శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా: కదిరి మాజీ ఎమ్మెల్యే (Ex LAL) అత్తర్ చాంద్ భాషా (Attar Chand Bhasha) ప్రధాన అనుచరుడు (follower), వైసీపీ నేత (YCP Leader) షామీర్ భాషా (Shamir Bhasha) కటకటాలపాయ్యాడు (Arrest). ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఆరోపణలమీద నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 301, దొంగపట్టాలు, 168 జిరాక్స్ దొంగ పట్టాలు, 32 పట్టాదారు పాస్ పుస్తకాలతోపాటు పది రకాల కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమీర్ భాషాను అనంతపురం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సహకరించిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మున్వర్‌తోపాటు మరో ఇద్దరు వైసీపీ నేతలు పరారీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా ప్రమేయంతోనే ప్రభుత్వ భూములను వైసీపీ నేత సమీర్ భాషా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజల నుంచి వైసీపీ నేత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి పట్టాలిచ్చారు.


ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన కీలక వైసీపీ నేతలు పరారీలో ఉన్నారు. కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లడంతోపాటు మరికొందరు పరారయ్యారు. కాగా షామీర్ భాషాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో తనిఖీలు చేయగా పెద్ద ఎత్తున నకిలీ ఇంటి పట్టాలతోపాటు, నకిలీ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ఐ మున్వర్ భాషా సహకారంతో నకిలీ ఇంటి పట్టాలతోపాటు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ రాత పూర్తకంగా ఫిర్యాదు చేశారు. కదిరి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని, నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేశారంటూ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

నా ఆత్మహత్య వెనుక అసలు కారణాలు డిప్యూటీ సీఎంకు తెలియాలి..

బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 07 , 2024 | 05:35 PM