AP News: వైసీపీ నేతల వేధింపులతో టీడీపీ కార్యకర్త మృతి
ABN, Publish Date - Nov 07 , 2024 | 01:16 PM
కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దాడిచేసి విచక్షణారహితంగా చావబాదడమే కాక.. దీపావళి పండక్కి ఇంటికొచ్చిన యువకుడిని ‘కేసు వెనక్కు తీసుకోకుంటే.. మీ ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తాం’ అని బెదిరించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల (YCP Leaders) వేధింపులతో (Harassment) తెలుగుదేశం పార్టీ కార్యకర్త (TDP Activist) గౌతమ్ (Goutam) ప్రాణాలు కోల్పోయాడు. బుక్కపట్నం మండలం, మారాల గ్రామానికి చెందిన గౌతమ్‌ను నాలుగు రోజుల క్రితం వైసీపీ నేతలు తీవ్రంగా బెదిరించారు. దాంతో మనస్తాపానికి గురైన గౌతమ్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం గాయాలు కావడంతో అతనిని బెంగళూరుకు తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం గౌతమ్ మృతి చెందాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయినట్లు గౌతమ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందువల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని కన్నీరు మున్నీరవుతున్నారు.
టీడీపీ అంటే అభిమానం...
కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని నిరుపేద దళిత కుటుంబం... పైగా టీడీపీ అంటే అభిమానం... ఇంకేముంది వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దాడిచేసి విచక్షణారహితంగా చావబాదడమే కాక.. దీపావళి పండక్కి ఇంటికొచ్చిన యువకుడిని ‘కేసు వెనక్కు తీసుకోకుంటే.. మీ ఫ్యామిలీ మొత్తాన్నీ చంపేస్తాం’ అని బెదిరించాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శరీరం 80 శాతం కాలిపోవడంతో ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మారాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నారాయణస్వామి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి భార్య ఓబుళమ్మ, కుమారులు గౌతమ్, నందీశ్‌కుమార్ ఉన్నారు. రెండు నెలల క్రితం గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా నారాయణస్వామిపై అదే ఊరికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ రామమోహన్ దాడిచేసి విచక్షణారహితంగా కొట్టాడు. దీనిపై అప్పట్లో నారాయణస్వామి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు..
ఇదే విషయంపై బుక్కపట్నం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ కృష్ణమూర్తితో మాట్లాడేందుకు నారాయణస్వామి ఈ నెల 2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆయన కోసం కుమారుడు గౌతమ్ స్టేషన్‌కు వస్తుండగా.. మార్గమధ్యంలో బుచ్చయ్యగారిపల్లి వద్ద వైసీపీ నాయకులు రామమోహన్, ప్రసాద్, ఓబుళప్ప, గోపి, సన్నరాముడు అతన్ని అడ్డగించారు. ‘నీ తండ్రి ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలి. లేదంటే మీ కుటుంబాన్ని మొత్తం హతమారుస్తాం’ అని బెదిరించారు. గౌతమ్‌ను దుర్భాషలాడారు. దీంతో మానసిక వేదన చెందిన గౌతమ్ పుట్టపర్తిలోని తమ తాత్కాలిక నివాసంలో శనివారం అర్ధరాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పు అంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మేం టీడీపీ వాళ్లమని.. మా నాన్నపై వాళ్లు దాడి చేశారు. ఫిర్యాదు వెనక్కు తీసుకోకపోతే మా కుటుంబాన్ని మొత్తాన్నీ చంపేస్తామని బెదిరించారు. దీంతో భయమేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని గౌతమ్ పోలీసులకు వాగ్మూలమిచ్చాడు. గౌతమ్‌కు ఇంకా వివాహం కాలేదు. ప్రస్తుతంలో బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకొనేందుకు స్వగ్రామానికి వచ్చాడు. వైసీపీ నేతల దౌర్జన్యంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..
ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్
స్థల వివాదంపై పీవీ సింధు ఏమన్నారంటే..
డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం (ఫోటో గ్యాలరీ)
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 07 , 2024 | 01:16 PM