AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
ABN, Publish Date - Jun 17 , 2024 | 08:15 PM
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసన సభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసన సభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25, 26 తేదీల్లో 3 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. 24న ప్రొటెం స్పీకర్‌ని ఎన్నుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ప్రొటెం స్పీకర్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు.
Updated Date - Jun 17 , 2024 | 08:22 PM