ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్ సాధించాం

ABN, Publish Date - Jun 15 , 2024 | 06:24 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనుక నాయకులు, కార్యకర్తల అలుపెరగని శ్రమ, ఆపార కృషి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. గత 20 ఏళ్లలో గెలవని చోట గెలిచామని, ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని వివరించారు. 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించిందన్నారు.

AP CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనుక నాయకులు, కార్యకర్తల అలుపెరగని శ్రమ, ఆపార కృషి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. గత 20 ఏళ్లలో గెలవని చోట గెలిచామని, ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని వివరించారు. 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించిందన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో శనివారం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి విజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.


క్లీన్ స్వీప్

‘ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం వెనక నేతలు, కార్యకర్తల ఐదేళ్లు కష్టం ఉంది. గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీ వచ్చాయి. పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. కార్యకర్తలు, నేతలు పోటీ పడి పని చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయి. విశాఖపట్టణం, శ్రీకాకుళం, అమలాపురం, గుంటూరు లోక్ సభ స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. ఐదేళ్లలో మీరు పడిన కష్టాలు గుర్తుంటాయి. ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర మరచి పోలేనిది. పసుపు జెండా పట్టుకుంటే చెయ్యి విరగొట్టారు. జై తెలుగుదేశం అంటే గొంతు కోశారు. అయినా కార్యకర్తలు బెదరలేదు. పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మరికొందరు ఆస్తులు కోల్పోయారు. ఇంకొందరు జైలుకు వెళ్లారు. కార్యకర్తల కష్టాలు, వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్ర లేని రాత్రులు గడిపాను. మీ త్యాగం నా జీవితంలో మర్చిపోలేను. ఎవరు...ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేస్తున్నాం. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం చేయాలి అనే విషయంలో ఆలోచన చేస్తున్నాం. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయవద్దు. ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలను విస్మరించ కూడదు. ప్రజలు తప్పుపట్టేలా ఎలాంటి పనులు చేయొద్దు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంతటి తీర్పు ఇవ్వలేదు. కూటమి విజయానికి సహకరించిన ప్రజలకు మేలు చేయాలి అని’ చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu: పోలీసులు అలా చేయొద్దు.. సీఎం చంద్రబాబు వార్నింగ్


హామీల అమలు

‘ఎన్నికల ముందు సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టోలో ప్రకటించాం.. ఇచ్చిన హామీలను తప్పుకుండా అమలు చేస్తాం. మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసి, 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై ఐదో సంతకం చేశాం. యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి అవకాశం ఉంటుంది. 2014-2019 మధ్య నెలకొల్పిన అన్న క్యాంటీన్లను వంద రోజుల్లో ఏర్పాటు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణ స్థాయి మార్చేలా పథకాలు అమలు చేస్తాం. 2047 నాటికి దేశం స్థితిగతులు మారాలి. తెలుగువారు నెంబర్-1 ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకోసం కష్టపడతాను. పార్టీ కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యం ఉండేలా నేతలు నడుచుకోవాలి. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తాం. నేను తరుచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతాను. జిల్లాలకు వెళ్లినప్పుడు కార్యాలయాలకు వెళతాను. నేతలు జిల్లాపార్టీ కార్యాలయానికి వెళ్లాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తాం. కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి ఇబ్బందులు పరిష్కరిస్తేనే వారిలో మనో ధైర్యం పెరుగుతుంది. గతంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించాం. ఇక ముందు ఆదుకుంటాం. ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టాం. పాజిటివ్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నాం అని’ చంద్రబాబు తేల్చిచెప్పారు.


మూడు పార్టీలు కలిసికట్టుగా

‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని బీజేపీ ముందుకొచ్చింది. మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ప్రజలతో మమేకమైతే ఇలాంటి ఫలితం 2029లో వస్తోంది. అహంకారానికి దూరంగా, బాధ్యతగా, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. పార్టీలో ప్రతి కమిటీ ఉత్సాహంగా పని చేయాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తాం. కూటమి ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను నా జీవితంలో మరచిపోను. ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా అని’ చంద్రబాబు ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

Updated Date - Jun 15 , 2024 | 06:24 PM

Advertising
Advertising